అమెరికాలో ప్రతిష్టాత్మకమైన అమెరికన్ మిస్సైల్ అవార్డు ని తెలుగువాడైన రక్షణ శాస్త్రవేత్త సతీష్ రెడ్డిని వరించింది.
అమెరికా ఇన్‌స్టిస్ట్యూట్ ఆఫ్ ఏరొనాటిక్స్ అండ్ ఏస్ట్రోనాటిక్స్ ఈ అవార్డు ని ప్రకటించింది.
బెంగుళూరు లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లో పలు విభాగాలలో మూడు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నందుకు గాను ఈ అవార్డు కి ఆయన ఎంపిక అయ్యారని అమెరికా ప్రకటించింది.
ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజన్సీ కు డిఫెన్స్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్‌గా సతీష్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.అయితే ఆయనతో పాటుగా ఇదే అవార్డు ని అరిజోనాకు చెందిన రాండెల్ జె.విల్సన్ అనే రిటైర్డ్ వ్యక్తి కూడా అందుకోబోతున్నారు.మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్‌కు టెక్నికల్‌గా , దాని సామర్థ్యాన్ని, వేగాన్ని మరింత పెంచినందుకు గాను రాండెల్ కి ఈ అవార్డు ప్రకటించారు.
అమెరికాలోని మేరీ ల్యాండ్ రాష్ట్రంలో ఉన్న జాన్స్ హ్యప్కిన్స్ యూనివర్సిటీ లో మే 7 నుంచి 9 వరకు ఈ అవార్డులని ప్రధానం చేస్తున్నారు.అయితే సతీష్ రెడ్డి కి మాత్రం భారత్ లోనే అవార్డు ని ఇవ్వనున్నారని తెలుస్తోంది.