మార్చి 1వ తేదీన ప్రధాని మోడీ ఏపీలో మరోసారి పర్యటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.వైజాగ్ వేదికగా ఈ పర్యటన జరుగుతుంది.
అక్కడ ప్రధాని మోడీ బారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే అవకాశం వుంది.ఏపీకి ప్రత్యెక హోదా, విభజన హామీలని అమలు చేయకుండా మోసం చేసిన ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నిరసన తెలియజేసేందుకు మరోసారి ఏపీలో ప్రత్యెక హోదా సాధన సమితి సిద్ధమైంది.
గుంటూరులో మోడీ బహిరంగ సభ సందర్భంగా భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేసిన ప్రత్యెక హోదా సాధన సమితి, మళ్ళీ వైజాగ్ లో కూడా అలాగే నిరసనలతో మోడీకి స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు.ప్రత్యెక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటన చేసారు.
మార్చి 1వ తేదీన వైజాగ్ లో జరిగే ప్రధాని పర్యటనకి నిరసనగా ప్రత్యెక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో సంకెళ్ళుతో స్వాగతం పలుకుతామని తెలియజేసారు.అలాగే విభజన హామీలు అమలు చేయకుండా ఏపీని మోసం చేసిన ప్రధాని మోడీకి నిరసన తెలియజేయడానికి అన్ని పార్టీలు రాజకీయాలకి అతీతంగా ముందుకి రావాలని చలసాని కోరారు.
ప్రత్యెక హోదా అనేది ఆంధ్రుల హక్కని అన్న, ఆయన దానిని సాధించుకోవడం కోసం అన్ని పార్టీలు ఏకమై మోడీ మీద ఒత్తిడి తీసుకురావాలని పార్టీలకి అతీతంగా వైజాగ్ లో మోడీ పర్యటనలో నిరసన ప్రదర్శనకి ముందుకు రావాలని కోరారు.అయితే దీనిపై ఎ పార్టీలు ఇప్పటి వరకు స్పందించలేదు.
మరి గుంటూరులో తెలుగు దేశం ప్రత్యెక హోదా సాధన సమితితో కలిసి నిరసన ప్రదర్శన చేసింది.మరి ఈ సారైనా వైసీపీ, జనసేన ఈ నిరసన ప్రదర్శనకి కలిసి వస్తాయా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.







