టిక్ టాక్ లో ఫుల్ బిజీ అయిపోయిన ఇండియన్స్!

ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చిన తరువాత అంతకు మించి సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలు పూర్తిగావాటికే అంకితం అయిపోతున్నారు.

ఇక ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియా పేజీలు, యాప్స్ ని వినియోగించడంలో భారతీయులు ఎప్పుడు ముందుంటారు.

ప్రపంచంలో కొత్తగా వచ్చిన ఏ అప్డేట్ అయిన ముందుగా అందిపుచ్చుకొని విపరీతంగా వాడేవారిలో భారతీయులు ఎప్పుడు టాప్ లో వుంటారు.సోషల్ మీడియా పేజీలు అయినా పేస్ బుక్, వాట్స్ యాప్ లని, రాజకీయంగా భారతదేశంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు.

ఇదిలా ఉంటే ఆ మధ్య ఇండియాలో డబాస్మస్ వీడియోలు ఎంతగా పాపులర్ అయ్యాయో అందరికి తెలిసిందే.సినిమాలో డైలాగ్స్, సాంగ్స్ కి తగ్గట్లు అభినయం చేయడానికి అనువుగా డబష్మస్ వుంది.

ఈ మధ్య దాటికి పోటీకి టిక్ టాక్, లైక్, హలో అంటూ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి.వీటి లో డైలాగ్స్, సాంగ్స్ ని, ఇతర యూజర్స్ తో కలిసి అభినయించే అవకాశం ఉంటుంది.

Advertisement

ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వున్నా ప్రతి ఒక్కరి చేతిలో ఈ సోషల్ యాప్స్ కూడా వున్నాయి.సెలబ్రెటీలు, సాధారణ ప్రజలతో సంబంధం లేకుండా ఇప్పుడు ఈ సోషల్ యాప్స్ నివినియోగించే వారు దేశంలో వున్నారు.

తాజా గా ఈ సోషల్ యాప్స్ లో భారతీయులు టాక్ యాప్ నివినియోగిస్తున్నారు అని బయటపడింది.ప్రపంచ వ్యాప్తంగా టిక్ టాక్ వినియోగదారులతో 39 శాతం మంది భారతీయులే అని ఓ సర్వే ద్వారా బయటపడింది.

దీనిని బట్టి స్మార్ట్ ఫోన్ యూజర్స్ టిక్ టాక్ ని ఏ రేంజ్ లో ఉపయోగిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..
Advertisement

తాజా వార్తలు