పవన్ ఎక్కడ దాక్కున్నావ్..శివాజీ సంచలనం..!!!

ఇన్నాళ్ళు గరుడ పురాణం పేరుతో ప్రజలని మభ్యపెడుతూ వచ్చిన శివాజీ ముసుగు రోజు రోజుకి వీడుతోంది.బాబు కి బాసటగా , ఏపీలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి రావడంకోసం బాబు వేస్తున్న ఎత్తుల్లో శివాజీ కూడా ఒక భాగమేనని అందరికి కనువిప్పు అయ్యింది.

 Hero Sivaji Sensational Comments On Pawan Kalyan Janasena-TeluguStop.com

గరుడ పురాణం సక్సెస్ అవ్వడం మాట పక్కన పెడితే తెరవెనుక ఉంది కధ నడిపిస్తోంది మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు అనే విషయాన్ని మాత్రం ఏపీ ప్రజలు బలంగా నమ్ముతున్నారు.నిన్నటి రోజున జరిగిన కార్యక్రమంలో గరుడ పురాణం లో నటిస్తున్న హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు టీడీపీ ని , చంద్రబాబు ని ప్రజలు చీదరించుకునేలా చేశాయి.

భారతదేశ ప్రధాని ఏపీ టూర్ చేపట్టి పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంఖుస్థాపన చేస్తున్న తరుణంలో విజయవాడలో కృష్ణ నదిలో నల్లరంగు బట్టలు వేసుకుని మోడీ గో బ్యాక్ అంటూ ఒక్క సారిగా హీరో అదేనండి నటుడు శివాజీ ప్రత్యక్షమయ్యారు.టీడీపీకి అండగా గరుడ పురాణం చెప్తూ వచ్చిన శివాజీ ఇప్పుడు బాబు పభుత్వంపై ఈగ వాలినా సరే వదిలి పెట్టే పరిస్థితి కనపడటం లేదు.మోడీ ఏపీ నుంచీ వెళ్ళిన తరువాతనే నేను నీళ్ళ నుంచీ బయటకి వస్తానని చెప్పిన శివాజీ మీడియాతో మాట్లాడి సినిమాలో కంటే కూడా వైవిధ్యమైన నటనని ప్రదర్శించాడు.అంతేకాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్రష్టాయిలో విమర్శలు గుప్పించారు.

పవన్ కళ్యాణ్ గతంలో బీజేపీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని విమర్శలు చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ దాక్కున్నారు అంటూ విమర్శలు గుప్పించారు.నాడు బీజేపీ ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు ని జత చేస్తూ కామెడీ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీకి అన్యాయం చేసిన మోడీ వస్తే మాత్రం నోరు ఎందుకు మెదపడంలేదు అంటూ పవన్ పై ఫైర్ అయ్యాడు.

ఇదిలాఉంటే బాబు ధర్మ బద్ధంగా చేస్తున్న ఢిల్లీ ధర్మ పోరాట దీక్షపై స్పందిచాడు.బాబు ఢిల్లీ లో చేయబోయే దీక్షకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు.అయితే విభజన తరువాత ఇదే తరహాలో బాబు పై తీవ్ర వ్యాఖలు చేసిన శివాజీ ఇలా ఒక్క సారిగా తన యూటర్న్ తీసుకోవడంలో టిక్కెట్టు మతలబు ఉందా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube