గీత గోవిందం చిత్రం తర్వాత రష్మిక మందన్న స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.అప్పట్లో కన్నడ సినిమాల్లో నటిస్తూ తెలుగులో ప్రయత్నాలు చేసిన ఈ అమ్మడు కన్నడ సినిమాలకు ప్రస్తుతం పూర్తిగా గుడ్ బై చెప్పేసింది.
తమిళంలో కూడా మంచి ఆఫర్లు వస్తున్నా కూడా ఎక్కువ పారితోషికం ఇచ్చే తెలుగు సినిమా పరిశ్రమనే ఈమె అంటి పెట్టుకుని ఉంటుంది.సినిమాల్లో తన నటనతో ఆకట్టుకునే ముద్దుగుమ్మ రష్మిక తాజాగా ఆసక్తికర విషయాన్ని బయటకు చెప్పి అందరిని ఆశ్చర్యపర్చింది.
తనకు ఇతరులతో పోల్చితే కాస్త సిగ్గు ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చింది.కెమెరా ముందుకు వెళ్లగానే నేను సిగ్గు పడిపోతాను.కొన్ని రొమాంటిక్ సీన్స్ లేదా కామెడీ సీన్స్ చేసే సమయంలో నా సిగ్గు వల్ల టేక్స్ మీద టేక్స్ తింటూ ఉంటాను.కొన్ని సార్లు దర్శకులు నా సిగ్గు వల్ల ఇబ్బంది పడి, కోపగించుకున్న సందర్బాలు కూడా ఉన్నాయి.
అందుకే నేను సిగ్గును తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాను.కాని అది మాత్రం సాధ్యం కావడం లేదని అంటోంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ తాను స్టేజ్ పై ఎక్కి మూడు నాలుగు మాటలు మాట్లాడేందుకు కాళ్లు చేతులు వణుకుతున్నాయని, అంత మంది మద్యలో, ప్రముఖుల ముందు మాట్లాడాలి అంటే చాలా టెన్షన్‌గా అనిపిస్తుందని, అసలు నేను సిగ్గుతో ఇంత పెద్ద హీరోయిన్ ఎలా అయ్యానో అంటూ కూడా కామెంట్ చేసింది.నాకు నేను సిగ్గు పడకుండా ఉండేందుకు చాలా ప్రయత్నిస్తాను కాని ఎప్పుడు మొహమాటం, సిగ్గుతో ఇబ్బంది పడుతూనే ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది.సిగ్గును వదిలేయాలనుంది అంటూ రష్మిక చేసిన వ్యాఖ్యలకు మరీ మొత్తం సిగ్గు వదిలేస్తే బాగోదు మేడమ్, కాస్త అయినా సిగ్గు ఉంచుకోమంటూ నెటిజన్స్ సలహా ఇస్తున్నారు.