అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ లను కొద్ది నెలల క్రితం మావోయిస్టులు కాల్చి చంపడం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.వీరిద్దరిని లివిపట్టు గ్రామ సమీపంలో మావోయిస్టులు కాల్చి చంపారు.
అయితే అప్పట్లో ఈ ఘాతుకానికి పాల్పడిన వారికోసం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టినా… ఫలితం కనిపించలేదు.ఈ నేపథ్యంలో ముగ్గురు అనుమానితుల ఫోటోలను కూడా… పోలీసులు విడుదల చేశారు.
కానీ ఎటువంటి ప్రయోజనం కలగలేదు.
అయితే ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్.ఐ.ఏ సుమోటాగా తీసుకుని దర్యాప్తు ప్రారంభించింది.ఈ నేపథ్యంలో అప్పటి నుంచి నిందితులను పట్టుకునేందుకు రకరకాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టింది.ఈ నేపథ్యంలో….ఈ కేసులో ప్రధాన నిందితుడు గా ఉన్న డంబరు ఖిలాను ఒడిశాలోని కొరాపుత్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.అయితే ఈ కేసు ఎన్ఐఏ పరిధిలో ఉండడంతో నిందితుడు డంబరు ఖిలాను జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించినట్లు కొరపుత్ జిల్లా ఎస్పీ కణర్ విశాల్ సింగ్ తెలిపారు.