కిడారి, సోమ హత్య కేసు నిందితుడి అరెస్ట్ !
TeluguStop.com
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ లను కొద్ది నెలల క్రితం మావోయిస్టులు కాల్చి చంపడం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
వీరిద్దరిని లివిపట్టు గ్రామ సమీపంలో మావోయిస్టులు కాల్చి చంపారు.అయితే అప్పట్లో ఈ ఘాతుకానికి పాల్పడిన వారికోసం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టినా.
ఫలితం కనిపించలేదు.ఈ నేపథ్యంలో ముగ్గురు అనుమానితుల ఫోటోలను కూడా.
పోలీసులు విడుదల చేశారు.కానీ ఎటువంటి ప్రయోజనం కలగలేదు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
అయితే ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్.
ఐ.ఏ సుమోటాగా తీసుకుని దర్యాప్తు ప్రారంభించింది.
ఈ నేపథ్యంలో అప్పటి నుంచి నిందితులను పట్టుకునేందుకు రకరకాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టింది.ఈ నేపథ్యంలో.
ఈ కేసులో ప్రధాన నిందితుడు గా ఉన్న డంబరు ఖిలాను ఒడిశాలోని కొరాపుత్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
అయితే ఈ కేసు ఎన్‌ఐఏ పరిధిలో ఉండడంతో నిందితుడు డంబరు ఖిలాను జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించినట్లు కొరపుత్ జిల్లా ఎస్పీ కణర్ విశాల్ సింగ్ తెలిపారు.
పవన్ కళ్యాణ్ పాన్ ఇండియాలో సక్సెస్ సాధిస్తాడా..?