వైసీపీ అధినేత జగన్ ఈ రోజు గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు.ఏపీలో ఓట్ల తొలగింపు… పోలీస్ అధికారుల పదోన్నతుల్లో అనేక అక్రమాలు జరిగాయంటూ….
ఇఇ సందర్బంగా జగన్ గవర్నర్ కు ఫిర్యాదు చేసాడు.అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన గత కొద్దోరోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయాలనే ఇప్పుడు గవర్నర్ కు కూడా వివరించామని చెప్పుకొచ్చారు.
దాదాపుగా 59 లక్షల బోగస్ ఓట్లు ఎలా ఉన్నాయో.వాటిని తొలగించాల్సిన అవసరం ఎంతగా ఉందో వివరించామని అన్నారు.అధికారాన్ని అడ్డం పెట్టుకుని రకరకాల సర్వేల పేరుతో ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్న విషయాన్ని గవర్నర్కు ఆధారాలతో సహా వివరించామని తెలిపారు.దాని ఆధారంగా టీడీపీకి ఓటు వేయని వారిని గుర్తించి.
వారి ఓట్లను దగ్గరుండి తొలగించే కార్యక్రమం ఎలా చేస్తున్నారో గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు జగన్ చెప్పారు.