అమెరికా కాంగ్రెస్ లో తాజాగా ప్రవేశపెట్టిన ఓ కీలక బిల్లు ద్వారా భారతీయ నిపుణులకి ఎంతో మేలు జరుగనుందని తెలుస్తోంది.అదేంటంటే.
అమెరికాలో శాశ్వత నివాసానికి అవసరమైన గ్రీన్ కార్డ్ జారీ కి ప్రస్తుతం అనుసరిస్తున్న దేశాల కోటా విధానానికి అమెరికా స్వస్తి పలుకనుంది.అందుకు గాను రెండు కీలక బిల్లుల్ని అమెరికా కాంగ్రెస్ లో ప్రవేశపెట్టింది.
ఈ బిల్లు గనుక అమలులోకి వస్తే భారతీయ నిపుణులకి భారీగా లబ్ది చేకూరుతుందని అంచనాలు వేస్తున్నారు.ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డుల జారీలో దేశాలకు కేటాయించే 7 శాతం కోటా పరిమితిని ఎత్తివేసేందుకు ఉద్దేశించిన ఫెయిర్‌నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమ్మిగ్రెంట్స్ యాక్ట్‌ను రిపబ్లిక్ సభ్యుడు మైక్ లీ, డెమోక్రటిక్ సభ్యులు కమలా హ్యారిస్ బుధవారం సెనేట్‌లో ప్రవేశపెట్టారు.
అయితే ఇలాంటి మరో బిల్లుని కాంగ్రెస్ సభ్యులు జో లోఫ్‌గ్రెన్, కెన్ బక్‌లు ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు.ప్రస్తుతానికి అమెరికా ప్రతీ ఏటా 1,40,000 గ్రీన్‌కార్డులను జారీ చేస్తున్నది.అయితే దేశ జనాభాతో సంబంధం లేకుండా ప్రతి దేశానికి 7 శాతం కోటా పరిమితిని అమలు చేస్తోంది.దీని వల్ల భారత్, చైనాలకు చెందిన వారికి నష్టం కలుగుతోందని అంటున్నారు.