నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో మరో ఘాతుకం.రైల్వేస్టేషన్ సమీపంలో ప్రియుడితో కలిసి మాట్లాడుతున్న యువతిని నలుగురు దుండగులు ఎత్తుకెళ్లారు.
అడ్డుపడిన ప్రియుడిని తీవ్రంగా కొట్టి ఆమెను వేరే ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.వివరాల లోకి వెళ్తే.

కాకినాడకు చెందిన యువకుడు… బాధితురాలు శ్రీసిటీలో ఒక కంపెనీలో పనిచేస్తున్నారు.కొంతకాలంగా వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు.ఊరికి వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌లో బోకారో ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీ ఎక్కేందుకు ఒకటవ నంబర్ ప్లాట్‌ఫారమ్ చివరన ఉన్న బెంచీపై కూర్చున్నారు.ఎప్పటి నుంచో వారిని గమనిస్తున్న ఐదుగురు యువకులు.
ఒక్కసారిగా ఆ ప్రేమజంటపై దాడి చేశారు.ప్రేమికుడిని రాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు.
ఆ రాత్రంతా ఆమెకు నరకం చూపించారు.వివస్త్రను చేసి రైలు పట్టాలపై నడిపించారు.
గాయపడిన ప్రియుడి అరుపులువిని పోలీసులు అక్కడకు రావడంతో పరారయ్యారు.పోలీసులు ఆ ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు.

బాధితురాలు కాళ్లావేళ్లా పడి ప్రాధేయపడినా కనికరించకుండా తీసుకువెళ్లి వివస్త్రను చేసారు.రైలు పట్టాల వెంబడి కొట్టుకుంటూ వెళ్లారు.ఒకరి తర్వాత ఒకరు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు.బాధితుడు, బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసారు.








