అమెరికాలో ఆ భారతీయ విద్యార్ధుల భవిష్యత్తు ప్రశ్నార్ధకం..??

అమెరికాలో ఎంతో మంది భారతీయ విద్యార్ధులు వివిధ యూనివర్సిటీలలో విద్యని అభ్యసిస్తున్నారు.అయితే తాజాగా జరిగిన నకిలీ వీసా విషయంలో ఫర్మింటన్ వర్శిటీని మూసేసి 130 మంది తెలుగు విద్యార్థులపై కేసులు పెట్టి వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్న విషయం అందరికి తెలిసిందే అయితే తాజాగా అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మరింత మంది భారతీయ విద్యార్ధులు తమ భవిష్యత్తు పై బెంగ పెట్టుకున్నారు.

 Indian Students In America Concerned About Future-TeluguStop.com

ఫర్మింటన్ యూనివర్సిటీ లా ఇంకెన్ని అలాంటి వర్సిటీలు ఉన్నాయో గుర్తించి వాటిని కూడా మూసేయాలని భావిస్తోంది.ఒక వేళ ఇదే గనుకా జరిగితే వేలాదిమంది భారతీయ విద్యార్ధుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది.

దాదాపు 80 వేల మంది విద్యార్థులు అమెరికాని వదిలేయడమే కాకుండా న్యాయపరంగా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ఇలా గుర్తించిన వర్సిటీలలో ఐదు వర్సిటీలు ఉండగా వాటిలో 80 వేలమంది ఉన్నారని వారిలో దాదాపు 50 వేల మంది భారతీయ విద్యార్ధులు ఉన్నారని అంటున్నారు.ఇదిలాఉంటే అమెరికాలో ఉంటున్న వలసదారులు ఈ నెల 5వ తేదీలోపు దేశం విడిచి వెళ్లాలని హుకుం జారీ చేయడంతో అమెరికాలో ఉంటున్న విద్యార్ధుల్లో భవిష్యత్తు పై బెంగ మొదలయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube