చీకట్లో ఫోన్ వాడుతున్నారా ...? అయితే ఇది మీరు తప్పక చదవాల్సిందే !

మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా .? రాత్రి పడుకోబోయే ముందు లైట్స్ అన్ని ఆపేసి మరీ ఆన్లైన్ కబుర్లకు అలవాటు పడ్డారా .

? అయితే కొన్ని కొన్ని సలహాలు.సూచనలు గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే.

ఎందుకంటే.చీకట్లో ఫోన్ వాడటం వలన ఏర్పడే నష్టాల గురించి తాజాగా యూనివర్శిటీ ఆఫ్ లింకోల్న్, ఇంపీరియల్ కాలేజ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో అనేక విస్తుగొలిపే అంశాలలు బయటకి వచ్చాయి.

ఎలాంటి లైటింగ్ లేకుండా రాత్రి సమయాల్లో ఫోన్లు, టాబ్లెట్లు, లాప్ టాప్ లు వాడడం వలన నిద్ర క్వాలిటీ లోపిస్తుందని, సరిగా నిద్ర పట్టడం, తద్వారా పరోక్షంగా నాణ్యమైన జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుందని ఈ అధ్యయనం చెబుతోంది.

ఇలా వెలుతురు లేకుండా ఫోన్లు వాడడం వల్ల తలెత్తే నిద్రలేమి కారణంగా, శరీరంలో రోగ నిరోధక శక్తి సన్నగిల్లడం, డిప్రెషన్, ఆందోళన, ఊబకాయం వంటి అనేక రకాల ఇతర సమస్యలు కూడా తలెత్తుతున్నాయని తేలింది.పడుకోడానికి గంట ముందు నుండి స్మార్ట్ ఫోన్లు వాడుతున్న అనేక మందిపై ఈ అధ్యయనం చేశారు.పడుకోడానికి గంట ముందు వరకు ఎలాంటి ఫోన్ స్క్రీన్ వాడని వారితో పోలిస్తే, లైటింగ్ ఉన్న గదిలో ఫోన్లని వాడిన వారికి 31 శాతం నిద్రలేమి సమస్య మొబైల్ ఫోన్లు అంత ఎక్కువగా వాడటం వలన, ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఇటీవలి కాలంలో సరిపడా నిద్ర పోవడం లేదని, ఒకవేళ నిద్రపోయినా కూడా, మధ్యలో లేచి ఫోన్లు ఛెక్ చేసుకోవడం వంటి అడిక్షన్ లక్షణాలు కలిగి ఉంటున్నారని ఈ అధ్యయనం తేల్చింది.

Advertisement
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు