న్యూ ఇయర్ 2019 లో మనందరం తప్పక తీసుకోవాల్సిన 10 నిర్ణ‌యాలు (రిజ‌ల్యూష‌న్స్‌) ఇవే.! ఎందుకంటే?

కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు.చాలా మంది అది చేయాలి, ఇది చేయకూడదు, అది మానేయాలి.

 10 Resolutions That We Must Take In New Year 2019-TeluguStop.com

అని చెప్పి చాలా నిర్ణయాలను తీసుకోవాలని చూస్తారు.కానీ ఆ నిర్ణయాలను పాటించే వారు చాలా తక్కువ మందే ఉంటారు.

అయితే ఈసారైనా కొత్త ఏడాదిలో కింద ఇచ్చిన పలు నిర్ణయాలను తీసుకోండి.దీంతో మీకు ఆరోగ్యం, ఇతర విషయాల పరంగా కొత్త సంవత్సరం కలసి వస్తుంది.

మరి మీరు తీసుకోవాల్సిన ఆ నిర్ణయాలు ఏమిటంటే…

1.కొత్త సంవత్సరంలో మీరు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి.అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి.అధిక బరువు ఉండే వారు దాన్ని తగ్గించుకోండి.

2.సోషల్ మీడియా ప్రభావాన్ని తగ్గించుకోండి.వీలుంటే పూర్తిగా మానేయండి.

3.ఇప్పటి వరకు డబ్బులు బాగా ఖర్చు చేసే వారు అయితే వాటిని పొదుపు చేసుకునేందుకు యత్నించండి.పొదుపు చేసుకునే వారు మరిన్ని మార్గాలను ఆలోచించండి.

4.మద్యపానం, ధూమపానం మానేస్తామని నిర్ణయం తీసుకోండి.

5.జాబ్ లేని వారు జాబ్ వెతుక్కోండి.జాబ్‌లో ఉన్నవారు ప్రమోషన్ కోసం యత్నించండి.

6.కుటుంబ సభ్యులతో సరదాగా గడిపే తీరిక లేని వారు ఈ ఏడాదిలో అయినా వారితో ట్రిప్ ప్లాన్ చేయండి.

7.ఏదైనా ఒక సాధు జంతువు లేదా మొక్కను పెంచుకోండి.

8.చెడు వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి.కొత్త వ్యక్తులతో పరిచయం పెంచుకోండి.వారితో స్నేహంగా మెలగండి.

9.మీ సమయాన్ని, డబ్బును మంచి పనుల కోసం ఖర్చు చేయండి.

10.కొత్త భాషను నేర్చుకునేందుకు యత్నించండి.కొత్త వంటకాలను వండడం నేర్చుకోండి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube