ఆత్మహత్య చేసుకునే ముందు...ఆ యువతి గోరింతతో చేతిపై ఏం రాసిందో తెలుసా.?

ఈమధ్య ప్రేమించడం.ప్రేమలో మోసపోవడం.

మోసపోయామని ఆత్మహత్య చేసుకోవడం అనే సంఘటనలు ఎక్కువ అయిపోయాయి.అలంటి ఓ ఘటనే తాజాగా హర్యానాలోని ఫరీదాబాద్‌లో చోటుచేసుకుంది.

ఆత్మహత్య చేసుకునే ముందు ఆ యువతి తన అరచేతిపై గోరింటతో సూసైడ్ నోడ్ రాసింది.ఆ సూసైడ్ నోట్ లో ఏముంది? అనే వివరాలలోకి వెళ్తే.!

సూసైడ్ నోట్‌లో తాను ప్రేమ పేరుతో ఒక యువకుని చేతిలో మోసపోయినట్టు పేర్కొంది.ఫరీదాబాద్‌లోని జమాయీ కాలనీలో హీనా అనే యువతి ఆత్మహత్య చేసుకుంది.తన ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ అరచేతిపై సూసైడ్ నోట్ రాసింది.

Advertisement

దానిలో బాయ్‌ఫ్రెండ్ ఫోను నెంబరు కూడా రాసింది.

సమాచారం అందుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు.మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రెండేళ్ల క్రితం వరకూ హినా.బీహార్‌లో ఉంటూ చదువుకుంటోంది.

ఈ నేపధ్యంలోనే ఆమెకు దూరపుబంధువైన సద్దామ్‌తో స్నేహం కుదరి, ప్రేమకు దారితీసింది.చదుపు పూర్తయ్యాక ఆమె తిరిగి ఫరీదాబాద్‌కు వచ్చింది.

ఈ సమయంలో వారిద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి.వీటి కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నదని పోలీసులు భావిస్తున్నారు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు