అయ్యో...జగన్ ని ఇలా ఇరికించేస్తున్నారే ...?

ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా…రాజకీయ జాతర కనిపిస్తోంది.ఒకవైపు సాధారణ ఎన్నికలకు సమయం ముంచుకు వచ్చేస్తుండడంతో….

 Chandrababu Naidu And Kiran Kumar Targeting To Jagan-TeluguStop.com

ఎక్కడలేని సంధి నెలకొంది.ప్రతి పార్టీ ఎన్నికల్లో గెలిచేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ… ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి.అధికార పార్టీ టీడీపీ విషయానికి వస్తే… వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పార్టీ గెలవడం చాలా ప్రతిష్టాత్మకం.అందుకే….అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ.ప్రజలకు చేరువయ్యే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ….నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తోంది.తాజాగా… కడప స్టీల్ ప్లాంట్ కి శంకుస్థాపన చేసి కేంద్ర అధికార పార్టీ బీజేపీకి టీడీపీ సవాల్ విసిరింది.ఇక జనసేన పార్టీ విషయానికి వస్తే… ఆ పార్టీ అధినేత పవన్ మొన్నటివరకు ప్రజల్లోనే ఉన్నారు… మధ్య మధ్యలో ఫారిన్ ట్రిప్పులు వేస్తూ…పార్టీకి మైలేజ్ తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.అలాగే పార్టీలో చేరికలు మీద కూడా దృష్టిపెట్టి బలం పుంజుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏపీ ప్రతిపక్ష నేత జగన్ గురించి.ఈ ఎన్నికలు ఆ పార్టీకి చావో రేవో అన్నట్టు ఉండే పరిస్థితి.వైసీపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతయినా ఉంది.అందుకే జగన్ సంవత్సరకాలంగా ప్రజల్లోనే ఎండనక వాననకా తిరుగుతున్నాడు.ఇప్పుడు ఆ యాత్ర మరి కొద్ది రోజుల్లో పూర్తికాబోతోంది.ఆ తర్వాత స్వల్ప విరామం ఇచ్చి ఆయన బస్సెక్కి బస్సుయాత్ర చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

ఇలా మూడు ప్రధాన పార్టీలు ఎన్నికల్లో గెలుపు కోసం కష్టపడుతూనే ఉన్నాయి.అయితే … ఇప్పటికే అనేక జాతీయ మీడియా సంస్థ సర్వేలను బట్టి చూస్తే ఇప్పటికైతే ఎన్నికల రేసులో జగన్ అందరికంటే ముందు ఉన్నారని… వచ్చే ఎన్నికల్లో దాదాపు ఆయన గెలవడం ఖాయం అని లెక్కతేల్చేశాయి.

టీడీపీ గతంకంటే బాగా బలహీనపడినట్టు ఆ సర్వేలు తేల్చడంతో బాబు అలెర్ట్ అయిపోయారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ….జగన్ కి అధికారం దక్కకుండా చేయాలనే ఉద్దేశంతో… పార్టీ సమీక్షలు… సమావేశాలు నిర్వహిస్తూ….పార్టీ నాయకుల్లో వేడి పెంచుతున్నారు.

పనిలో పనిగా జగన్ మీద సరికొత్త రీతిలో ఎదురుదాడి మొదలుపెట్టాడు చంద్రబాబు.దొరికిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటూ జగన్ ను టార్గెట్ చేస్తోంది టీడీపీ.

ఏపీలో బాబు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు అన్న ఆలోచన ప్రజల్లో కలిగించేలా ప్రయత్నాలు చేస్తోంది.ఇందుకు గానూ జగన్ ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారని పదే పదే ప్రచారం మొదలుపెట్టింది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయం చెబుతుండటం జగన్ కి నష్టం జరిగేలా ఉంది.ప్రధానంగా జగన్ అసెంబ్లీకి వెళ్లడం లేదని, పోరాడటం లేదని జగన్ ఈ రెండు పార్టీలూ పదే పదే టార్గెట్ చేస్తున్నాయి.

ఇక ఇప్పుడు టీడీపీతో కలిసిన కాంగ్రెస్ కూడా ఈ వాదనను వినిపిస్తోంది.ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ప్రతిపక్ష నేతగా జగన్ ఫెయిల్ అయ్యారని వ్యాఖ్యానించారు.అలాగే జేసీ దివాకర్ రెడ్డి కూడా కష్టమైనా నష్టమైనా బాబు కే ఓటు వెయ్యాలని పిలుపునిచ్చారు.అలాగే ఏపీకి స్పెషల్ స్టేటస్ రాకుండా అడ్డుకున్న టీఆర్ఎస్ పార్టీతో జగన్ అంటకాగుతున్నాడు అంటూ… ప్రచారం మొదలుపెట్టింది.

జగన్ కి ఏపీ ప్రయోజనాలకంటే టీఆర్ఎస్ తో దోస్తీనే ముఖ్యమయ్యింది అంటూ విమర్శలు చేస్తోంది.ఇలా ప్రతి విషయంలోనూ… ఏదో ఒకరకంగా జగన్ ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube