ఏపీ టీడీపీ లో ఇప్పుడు టెన్షన్ వాతావరణం నెలకొంది.జనవరిలో అభ్యర్థుల మొదటివిడత లిస్ట్ ప్రకటిస్తానని చంద్రబాబు ప్రకటించడం పార్టీ నాయకుల్లో కలవరం పుట్టిస్తోంది.
తమకు టికెట్ వస్తుందా రాదా అనే సందేహంలో సిట్టింగ్ ఎమ్యెల్యేలు ఉండాగా… సిట్టింగ్ ఎమ్యెల్యేలకే సీట్లు కేటాయిస్తే మా సంగతి ఏంటి అని ఆశావాహులు ఆందోళన చెందుతున్నారు.ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్యెల్యేల్లో అభద్రత ఎక్కువగా కనిపిస్తోంది.
పైకి బాహాటంగా చెప్పలేక పోతున్నా.టీడీపీ సిట్టింగులు చాలా మంది.
తమలో తామే తర్జన భర్జన పడుతున్నారు.వీరి సంగతి ఇలా ఉంటే బాబు మాత్రం ఇంకోలా ఆలోచన చేస్తున్నాడు.
ప్రస్తుత ఎమ్యెల్యేలు… పార్టీ నాయకులు పార్టీ కోసం పనిచేయకుండా తనని మోసం చేస్తున్నారా అనే భావనలో బాబు ఉన్నట్టు కనిపిస్తోంది.

తాజాగా పార్టీ నాయకులతో అమరావతిలో సభ్యత్వ నమోదు గురించి నిర్వహించిన సమీక్ష సమావేశంలో చంద్రబాబు ఆవేదన గమనిస్తే ఆయనకు పార్టీ వ్యవహారాల్లో జరుగుతున్న లొసుగులు గురించి బాధపడుతున్నట్లుగా అర్థమవుతోంది.సభ్యత్వ నమోదు దయనీయంగా ఘోరంగా ఉన్న ప్రాంతాల నాయకులను ఉద్దేశించి చంద్రబాబునాయుడు మీరు పార్టీని మోసం చేస్తూ ఉంటే ఎలా అని నిలదీయడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.ఎందుకు ఇంతగా అటు చంద్రబాబుకు, ఇటు నేతలు తమకు తాము తర్జన భర్జన పడేలా పరిస్థితి వస్తోంది? అని ఆలోచిస్తే కేవలం ఒకే ఒక పాయింట్ కనిపిస్తోంది.ఇప్పుడున్న సిట్టింగులకు టికెట్లు వస్తాయనే ఆశలు కానీ, భరోసా కానీ కనిపించక పోవడమే! ఆది నుంచి కూడా చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరితో వారు తర్జన భర్జన పడుతూనే ఉన్నారు.అందరూ కష్టపడుతున్నారని చెప్పడానికి బదులుగా చంద్రబాబు కొందరికి మాత్రమే కితాబు నివ్వడాన్ని వారు సహించలేక పోతున్నారు.

ఇక ఏపీలో పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం బాబు చాలానే కష్టపడుతున్నాడు.దీనికోసం పార్టీ చాలా పెద్దపెద్ద టార్గెట్లే పెట్టుకుంది.కానీ, శుక్రవారం నాటి సమీక్షను గమనించినప్పుడు.వారు ఆశించినట్లుగా ప్రజల్లో స్పందన రావడం లేదని తెలుస్తోంది.చాలా పరిమితంగా కొన్ని జిల్లాల్లో సభ్యత్వ నమోదు బాగానే జరిగిందిట.చాలా చోట్ల అనుకున్నట్లు జరగలేదని బాబుకు కోపం పెరిగిపోయింది.
మీరు ఇలాగే చేస్తుంటే.ముందు ముందు మనం ఇళ్లలోనే కూర్చోవాల్సి వస్తుంది అంటూ.
చంద్రబాబు పార్టీ నేతలకు గట్టిగానే క్లాస్ పీకాడు.పార్టీ కోసం కాసపడ్డ వారికే.
తన ప్రాధాన్యత ఉంటుందని… బాబు వారికి అర్ధమయ్యేలాగానే చెప్పాడు.ఒకవైపు తెలంగాణాలో ఘోరంగా విఫలం అవ్వడం… మరోవైపు తన ప్రత్యర్థులు బలం పుంజుకోవడం అలాగే వీరందరికి కేసీఆర్ సపోర్ట్ గా నిలిచి టీడీపీ కి అధికారం దక్కకుండా చేయాలనుకోవడం ఇవన్నీ… కలవరం పెట్టిస్తున్నాయి.
అందుకే.ఇప్పుడు ఏపీ టీడీపీలో రెండురకాల టెన్షన్ వాతావరణం నెలకొంది.







