కడుపు నింపుకునేందుకు కొన్ని సార్లు కఠిన పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి ఇంకా సమాజంలో ఉంది.ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో తినడానికి తిండి లేక నానా పాట్లు పడుతున్న జనాలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
కుటుంబ పోషణ కోసం కొందరు మహిళలు పడుపు వృత్తిని ఎంచుకుంటున్న విషయం తెల్సిందే.ఇలాంటి సమయంలో కెన్యాలో జరుగుతున్న ఒక సంఘటన ప్రతి ఒక్కరి హృదయాలను ద్రవింపజేస్తుంది.
కెన్యాలోని జజ్వా అనే పద్దతి ప్రపంచంలోనే అత్యంత దారుణ పరిస్థితిల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు.
కెనాలోని మారుమూల ప్రాంతం అయినా హోమాయిలో అత్యంత కడు పేదరికంను అక్కడి జనాలు ఎదుర్కొంటున్నారు.
అక్కడి మహిళలు తినడానికి తిండి లేక పోవడంతో వ్యభిచారంను వృత్తిగా ఎంపిక చేసుకుంటున్నారు.ఇక అక్కడ జాలర్లు చేపలు పట్టి, వాటిని అమ్మకుండా వాడవారు తమతో పడుకుంటే వాటిని ఇచ్చేందుకు ముందుకు వస్తారు.
అంటే ఎవరికైతే చేపలు కావాల్సి ఉంటుందో వారు జాలర్లతో వ్యభిచారంకు ఒప్పుకోవాల్సిందే.డబ్బు కాకుండా చేపల రూపంలో వారికి ప్రతిఫలంను జాలర్లు ఇస్తూ ఉంటారు.ఈ పద్దతిని జజ్వా అంటారు.

అక్కడి ఎంతో మంది ఆడవారు కుటుంబను పోషించుకునేందుకు ఇలాంటి పద్దతిలోనే కొనసాగుతారు.అత్యంత దారుణమైన దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్న అకడి ఆడవారి పరిస్థితులను స్థానిక మహిళ రచెల్ అటినో పేర్కొంది.35 ఏళ్ల ఆ మహిళ కొన్నాళ్ల క్రితం భర్తను పోగొట్టుకుంది.
ఆమె భర్త మరణం తర్వాత పిల్లల బాధ్యత ఆమెపై పడినది.దాంతో ఆమె పిల్లలను పెంచేందుకు జజ్వాను ఎంపిక చేసుకుంది.తప్పనిసరి పరిస్థితుల్లో తాను వ్యభిచారం చేస్తున్నాను అని, తనకు ఇది తప్ప మరే మార్గం లేదని చెప్పుకొచ్చింది.పని చేసుకోవడానికి కూడా అక్కడ సరైన వసతులు ఉండవు.