రావమ్మా మాల్యా : ఇండియాకు అప్పగించాలంటూ బ్రిటన్ కోర్టు తీర్పు

భారీగా రుణాలను ఎగ్గొట్టి … బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టి … విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ మాల్యాకు ఎదురుదెబ్బ తగిలింది.విజయ్‌ మాల్యాకు బ్రిటన్‌లోని వెస్ట్‌ మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో చుక్కెదురయింది.

 Britains Court Ruled To Hand Over Vijay Malya To India-TeluguStop.com

మాల్యాను భారత్‌కు అప్పగించే విషయంలో సోమవారం తీర్పు వెలువరించిన న్యాయస్థానం.భారత ప్రభుత్వ వాదనను సమర్ధించింది.ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.9 వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసం చేయడంతో పాటు, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు మాల్యాపై ఉన్నాయి.రుణ బకాయిలను వసూలు చేసుకునేందుకు బ్యాంకుల కన్సార్షియం న్యాయపరమైన చర్యలు ప్రారంభించిన క్రమంలో 2016లో విజయ్‌ మాల్యా భారత్‌ బ్రిటన్ పారిపోయారు.అప్పటి నుంచి అతడిని ఇండియా కు రప్పించేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు.

మాల్యాపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన సీబీఐ, ఈడీలు అతన్ని భారత్‌కు అప్పగించాలని బ్రిటన్‌ కోర్టును ఆశ్రయించాయి.భారత ప్రభుత్వం తరఫున బలంగా వాదనలు వినిపించారు.మరోవైపు తనపై రాజకీయ దురుద్దేశంతోనే కేసులు మోపారని, భారత జైళ్లలో దారుణ పరిస్థితులు ఉంటాయని మాల్యా వెస్ట్‌మినిస్టర్‌ కోర్టులో వాదించారు.ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం భారత ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ.

నేడు తీర్పు వెలువరించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube