భారత రైల్వే వివిధ జోన్లలో 2018 – 19 సంవత్సరానికిగానూ 2,835 అప్రెంటిస్ షిప్ ఖాళీల భర్తీకి ప్రకటనలు విడుదల చేసింది.సంబంధిత జోన్ పరిధిలోని ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను వేటికవే భర్తీ చేస్తారు.
తాజాగా ఈశాన్య రైల్వే, వాయవ్య రైల్వేలు ప్రకటనలు విడుదల చేశాయి.ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆయా జోన్లకు విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి.

ఈశాన్య (నార్త్ ఈస్టర్న్) రైల్వే – గోరఖ్‌ఫూర్ ఖాళీలు: 745
వాయవ్య (నార్త్ వెస్టర్న్) రైల్వే – జైపూర్ ఖాళీలు: 2090
అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ / నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉత్తీర్ణత.ఎంపిక: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తుకు చివరి తేదీ: ఈశాన్య రైల్వేకు డిసెంబరు 29 కాగా వాయవ్య రైల్వేకు డిసెంబరు 30.
వెబ్‌సైట్: https://www.ner.indianrailways.gov.in, https://www.rrcjaipur.in/.







