సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది.ఇప్పుడు ప్రతి పనికి ఏదో ఒక సాంకేతిక పరిజ్ఙానం అందుబాటులోకి వస్తోంది.
ఈ విధంగానే… ఏటిఎంలలో నగదు డ్రా చేసుకునేందుకు కొత్త పద్ధతి రానుంది.మొబైల్ ఫోన్లలోని యుపిఐ ఫ్లాట్‌ఫాం ద్వారా ఎటిఎంలలో క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి నగదు పొందేలా సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు ఎజిఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ సంస్థ తెలిపింది.
దీనికి సంబంధించి కొత్త యాప్‌లు డౌన్ లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది.ప్రస్తుతం ఈ ప్రతిపాదన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) వద్ద ఆమోదం పొందాల్సి ఉందని ఎజిఎస్ వెల్లడించింది.అక్కడ ఈ పరిజ్ణానం కనుక ఆమోదం పొందితే ఆ తరువాత ఇది అతి త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది .