గల్ఫ్ దేశాలలో ఎంతో మంది భారతీయులు పని చేయడం కోసం వెళ్లి అక్కడ ఎంతో అవమానాలు , చిత్రహింసలు పడుతున్నారు.ఒక్కో సారి వారు పెట్టె హింసలకి తట్టుకోలేక చనిపోతున్నారు అంటూ ఎన్నో రకాల వార్తలు విన్నాము అయితే ఇప్పుడు జరిగిన ఈ సంఘటన చూస్తె ఇలాంటి యజమానులు సౌదీలో కూడా ఉన్నారా అనే సందేహం కలగక మానదు.
వివరాలలోకి వెళ్తే.
తన ఇంట్లో 35 ఏళ్ల పాటు పని చేసిన ఒక భారతీయ వ్యక్తిని భారత్ పంపిస్తున్న సందర్భంలో ఆ కుటుంభం మొత్తం వారి ఇంట్లో కార్యక్రమంలా ఎంతో ఘనంగా సత్కరించారు.లక్షల విలువైన కానుకలు ఇచ్చారు.కన్నీటి పర్యంతమయ్యారు.
సౌదీ రాయల్ కుటుంబం భారతీయ వ్యక్తికి ఘనమైన వీడ్కోలు పలికింది…ఆ వ్యక్తి పేరు మిదో షీరియన్ ఆయన సుదీర్ఘ కాలం ఆ రాయల్ కుటుంబంలో పని చేసి ఇక తన సొంత ఊరుకు వెళ్తున్న క్రమంలో వారు ఏకంగా ఒక వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసి మరీ సాగనంపారు.
అతడు ఇంతకాలం తమ వద్ద చేసినందుకు గాను అతడికి భారీ ఎత్తున డబ్బు ని కూడా ఇచ్చారు.ఇంకా విలువైన వస్తువులు కూడా అతడికి ఇచ్చారు.అయితే ఈ కార్యకమం మొత్తం సోషల్ మీడియాలో ఉంచడంతో అది ఇప్పుడు వైరల్ అవుతోంది, సంచలనం సృష్టిస్తోంది.
2 Attachments