అబ్బో ! అవి మాటలు కాదు ... తూటాలు !

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి మొదలయ్యింది.ముఖ్యంగా తెలంగాణాలో పోలింగ్ సమయం కూడా దగ్గరకు వచ్చెయ్యడం తో అన్ని పార్టీల నాయకులు వాడీ వేడి ప్రసంగాలతో హీటు పెంచుతున్నారు.

 Trs Speech War In Telangana Elections-TeluguStop.com

అంతే కాదు అసలు ఏం మాట్లాడవచ్చు ఏం మాట్లాడకూడదు అనే విషయాలన్నింటిని పక్కనపెట్టేసి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ… తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.తెలంగాణాలో టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలన్నీ కలిసి కూటమి కట్టి టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకున్నాయి.

టీఆర్ఎస్ కూడా కూటమిలో ఉన్న పార్టీల్లో టీఆర్ఎస్ కి నష్టం చేకూర్చే నాయకులను సెలెక్ట్ చేసుకుని మరీ … తిట్ల దండకం మొదలుపెడుతున్నారు.ఈ విషయంలో కేసీర్ … కేటీఆర్ తమ నోటికి పదును పెడుతూ… అందరికంటే ముందున్నారు.

ఇప్పుడు తెలంగాణాలో నాయకుల అంతా తమ నోటిని ప్రధాన అస్త్రంగా చేసుకుని ప్రత్యర్థులపై మాటల బాణాలు వదులుతున్నారు.

వివిధ పార్టీల అగ్ర నాయకులంతా… తమ ప్రసంగాలతో వేడి పుట్టిస్తున్నారు.ఇప్పటికే చాలా సభలు, రోడ్‌ షోల్లో, అనేక స్పీచ్‌లు ఇచ్చారు.నాయకులు ఒకరిని ఒకరు వ్యక్తిగతంగా దూషించుకుంటున్నారు.

అవే తమను గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు.
టీఆరఎస్ పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీ అధినేత వరుస పర్యటనలతో….

ఓ ఊపు ఊపేస్తున్నారు.ప్రతిరోజు కనీసం ఐదు నుంచి ఎనిమిది సభల వరకూ నిర్వహిస్తూ, ప్రసంగాల చేస్తున్నారు.

అయన ప్రధాన టార్గెట్ అంతా… చంద్రబాబు నాయుడు మాత్రమే అన్నట్టుగా ముందుకు వెళ్తున్నారు.ఆయనే కాదు.

కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఇతర కీలక నేతలంతా, చంద్రబాబును తెలంగాణ వ్యతిరేకిగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లుందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

తెలంగాణ రాకముందు, కరెంటు కోతలతో తెలంగాణ అల్లాడిపోయిందని, ఇప్పుడు ఎలాంటి పవర్ కటింగ్ లు లేకుండా ఉందని…కేసీఆర్ చెప్పుకుంటున్నాడు.మళ్లీ కాంగ్రెస్‌ వస్తే, తెలంగాణ చీకటిమయం అవుతుందని, ప్రజలను హెచ్చరిస్తున్నారు.కేవలం ఆరోపణలు, విమర్శలే కాదు, పథకాలు తమ అస్త్రాలుగా భావిస్తున్నారు కేసీఆర్.

ఇక కాంగ్రెస్ , టీడీపీ, బీజేపీ ఇలా అన్ని పార్టీలు తమ ప్రధాన శత్రువు అయిన టీఆర్ఎస్ పార్టీని ఉతికి ఆరేసే పనిలో నిమగ్నమయ్యాయి.టీఆర్ఎస్ ప్రభుత్వంలో వేలకోట్ల అవినీతి కి పాల్పడిందని…అక్కడ అంతా కుటుంబ పాలన సాగుతోందని చెప్తూ వారి వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేసుకుని మరీ విమర్శలు చేస్తున్నారు.అయితే పార్టీల మధ్య ఆహ్లాదకర పోటీ… విమర్శలు ఉంటే ఫర్వాలేదు కానీ మరీ శృతిమించి ఒకరిని ఒకరు తిట్టుకుంటే మాత్రం అందరూ ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube