జనసేన లో పైకి అంత స్తబ్దుగా ఉన్నట్టు కనిపిస్తున్నా… లోలోపల మాత్రం ఏదో తెలియని భయం వెంటాడుతోంది.ప్రస్తుతం జనసేనలో తలెత్తుతున్న పరిణామాలు… ప్రజారాజ్యం పార్టీలో నెలకొన్న పరిణామాలు వలే మారుతున్నట్టు కనిపిస్తున్నాయి.
గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఈ విధంగానే… ఒకరకమైన ఊపు కనిపించింది.ఆ తరువాత వరుస ఆరోపణలతో ఆ పార్టీ అధినేత చిరంజీవి ఉక్కురిబిక్కిరి అయ్యారు.
నిజానికి ఆ పరిణామాలకు చిరంజీవికి పెద్ద సంబంధం లేకపోయినా… అయన మాత్రం చాలా అపకీర్తి మూటగట్టుకున్నాడు.ఈ నేపథ్యంలో ఇంతే స్పీడ్ గా అయితే… ఆ పార్టీ ప్రజల ముందుకు వచ్చిందో అదే స్థాయిలో కనుమరుగు అయిపొయింది.
ఇప్పుడు జనసేనలో కూడా అటువంటి పరిణామాలు తలెత్తే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి.
ఈ భయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లోనూ ఉంది.అందుకే ఆ పరిణామాలను పవన్ ముందుగానే ఊహించి అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకున్నారు.తన కోటరీలో అత్యంత నమ్మకమైన వ్యక్తులనే నియమించుకుంటున్నారు.
అందులోనూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయని నేతల కే పవన్ ప్రాధాన్యం ఇస్తున్నాడు.జనసేన పార్టీ స్థాపించి దాదాపు నాలుగేళ్లకు పైగానే అవుతుంది.
అయితే ఇప్పటి వరకూ జిల్లా కమిటీలు లేవు.మండల స్థాయిలో కూడా ఆ ఊసే లేదు.
కేవలం రాష్ట్ర కమిటీనే నియమించారు.ఇటీవల జనసేన పార్టీ సమావేశంలో పదవుల నియామకంపై చర్చకు వచ్చిన సందర్భంలోనూ పవన్ కల్యాణ్ విముఖత వ్యక్తం చేశారని తెలిసింది.
పదవులు ఎవరికీ ఉండవని, జనసేనలో పనిచేసే వారందరికీ సమానమైన హక్కులు ఉంటాయని పవన్ నిక్కచ్చిగా చెప్పేస్తున్నాడు.
పవన్ జనసేన లో ఎవరికి పదవి ఇచ్చినా… ఎవరిని పార్టీ లో చేర్చుకున్నా… ముందు వెనుకా అన్ని చూసుకుని మాత్రమే అడుగులు వేస్తున్నాడు.కొంత కలం క్రితం
జిల్లాలకు కో-ఆర్డినేటర్లను నియమించారు.వారిని కూడా అన్ని రకాలుగా ఆలోచించి, బ్యాక్ గ్రౌండ్ తెలుసుకున్న తర్వాతనే పవన్ వారిని నియమించారు.జిల్లా కమిటీలను నియమిస్తే టిక్కెట్ల విషయంలో తేడా వస్తుందని పవన్ భయపడిపోతున్నారట.ఇటీవల కొందరు టిక్కెట్ల విషయంలో హామీ ఇస్తున్నారని తెలిసి వారిపై పవన్ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.
కొన్ని సభలు… సమావేశాల్లో కూడా ముందు జాగ్రత్తగా… తాను ఎవరికి టికెట్ కేటాయించలేదని ఒక్క బాలకృష్ణ కు మాత్రమే టికెట్ ఇచ్చామని ఇటువంటి విషయంలో ఎవరైనా ఏవైనా హామీలు ఇస్తే అది పార్టీకి సంబంధం లేదు అంటూ… పవన్ చెప్పుకుంటున్నాడు.జనసేనలో ఉన్న నాయకులంతా ఎక్కువ పవన్ సామాజిక వర్గానికి చెందినవారే కావడంతో… పదవుల భర్తీ మొదలు పెడితే పవన్ తన సామాజికవర్గానికి పెద్ద పీట వేసాడని అపవాదుతో పాటు అనవసర తలనొప్పులు వస్తాయని భయపడుతున్నాడు.
.