జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో పొలిటికల్ హిట్ పెంచేస్తున్నారు.ఎన్నికలకు మరో ఐదు నెలల సమయం వుండగానే పూర్తిస్థాయిలో చంద్రబాబు, జగన్ లపై విమర్శన బాణాలు సంధిస్తున్నారు.
అయితే గతంలో కంటే కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన స్పీడును పెంచడానికి అసలు కారణం ఏమిటి.?? చంద్రబాబు తప్ప తన విమర్సల లిస్టు లో జగన్ ని పెట్టని పవన్ కళ్యాణ్ ఈ సారి మాత్రం జగన్ ని హిట్ లిస్టు లో పెట్టడానికి గల కారణాలు ఏమిటి.?? అంటే అందుకు తగ్గ కారణాలు లేకపోలేదని తెలుస్తోంది వివరాల్లోకి వెళితే.

తూ.గో జిల్లా ప్రజాపోరాట యాత్రలో బిజీ ,బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ జగన్ పై నిప్పులు చెరుగుతున్నారు నువ్వు ఏం రెడ్డి వి అంటూ అత్యంత ఘాటైన పదునైన వ్యాఖ్యలు చేస్తున్నారు, నీ మగతనం నిరూపించుకో అంటూ తీవ్ర వ్యాఖ్యలుతో విరుచుకుపడుతున్నారు.నా వ్యక్తిగత విషయాల జోలికి వస్తే నడిరోడ్డుపై కొట్టగలను అంటూ రాయలసీమ బిడ్డ కే వార్నింగ్ లు ఇస్తున్నారు.
జగన్ గనుక అధికారంలోకి వస్తే సినిమాలు మానేసి సాయుధ పోరాటం చేయాలని అందుకు నేను సిద్ధంగా ఉన్నాను అంటూ ప్రకటనలు చేయడంతో సర్వత్ర పవన్ వైఖరిపై చర్చనీయాంశమవుతోంది.
అయితే ఈ తరహాలో వాడివేడిగా విమర్శల దాడి చేయడానికి కారణాలు లేకపోలేదని అందుకు సవాలక్ష కారణాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.
జగన్ పై ఈ స్థాయిలో విమర్శలు చేయడానికి ప్రధాన కారణం ఏమిటంటే.రాబోయే ఎన్నికల్లో వైసీపీ తో జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంటుందని గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
ఈ ప్రచారం గ్రామస్థాయి వరకు వెళ్లి పవన్ 25 సీట్లకు అంగీకరించాడు అంటూ ఆ నోట ఈ నోట పుకార్లు పుట్టడం తో జనసేన, వైయస్ జగన్ ఒక్కటేనంటూ పల్లెల్లో ప్రజలు సిక్స్ అయిపోయారట అయితే ఈ విషయం తన సన్నిహిత వర్గాల ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహంతో వైసీపీ తో జరిగిన ప్రచారం జనసేన పార్టీ తీవ్ర నష్టం తెచ్చిపెడుతుందని ఆందోళన చెందారట.దాంతో

ఎన్నడూ లేనంతగా జగన్ పై విమర్శలు ఎక్కు పెట్టారని అలా చేస్తేనే ప్రజలు ఇద్దరి పార్టీల మధ్య స్నేహ భావం లేదని భావిస్తారని డిసైడ్ అయ్యారట.అంతేకాదు తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లి పోతున్న తరుణంలో వైసిపి అత్యంత బలమైన పార్టీగా అక్కడ ఏర్పడుతున్న సమయంలో పవన్ ఎంట్రీ తో అక్కడ రాజకీయ పరిస్థితులు అయ్యాయి.జగన్ మద్దతుదారులు చాలామంది పవన్ వైపు మళ్లే తరుణంలో ఇద్దరు ఒక్కటేననే భావన కలిగితే తప్పకుండా ఆ ప్రభావం తెలుగుదేశానికి మళ్ళీ అనుకూలం అవుతుందని పవన్ భావించారట.
దాంతో పవన్ కళ్యాణ్ జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.ఏది ఏమైనా సరే ఎన్నిలు దగ్గర పడకుండానే పొలిటికల్ హీట్ ఈ రేంజ్ లో ఉంటుంటే ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో వేచి చూడాల్సిందే.







