ఏపీలో తెలుగు దేశం నేతలని హోల్సేల్ గా పవన్ కళ్యాణ్ భయం పరుగులు పెట్టిస్తోంది.సునామీలా వచ్చి.
ఉప్పెనా ఎగసి మీదడి పోతాడేమో నని ఇప్పటికే పలువురు నేతలు తెగ వారీ అవుతున్నారు.పవన్ కళ్యాణ్ అండతో అధికారంలోకి వచ్చిన టీడీపీ పార్టీ ని ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ వెనక్కి లాగేస్తుండటంతో తమ్ముళ్ళు అందరూ ఆందోళనలో ఉన్నారని తెలుస్తోంది.
ఒక పక్క కేంద్రంలో బీజేపీ దూరం అయ్యింది, మరో పక్క జనసేన దూరం అయ్యింది ఇప్పుడు ఇద్దరూ వివిడిగా టీడీపీపై దాడిని ఉదృతం చేశారు దాంతో తమ్ముళ్ళకి దారి తోచడం లేదని తెలుస్తోంది.

ఇదిలాఉంటే ఏపీలో జగన్ రెడ్డి కి ప్రతీ నియోజకవర్గంలో సొంత ఓటు బ్యాంక్ ఉంది గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఓటు బ్యాంక్ సైతం వైసీపీ వైపు మళ్ళింది.ఆ సమయంలో బీజేపీ , పవన్ కళ్యాణ్ కలిసి ఆ లోటుని పూడ్చారు.కానీ ఇప్పుడు కూడా వైసీపీ వైపు వెళ్ళిన టీడీపీ ఓటు బ్యాంక్ స్థిరంగా అక్కడే ఉంటుంది.
గతంలోలా బీజేపీ ,జనసేన మద్దతు లేదు మరి వెళ్ళిపోయినా ఓటు బ్యాంక్.ప్రస్తుతం టీడీపీ కి ఓటు వేయాలా వద్దా అనే ఆలోచనలో పడిన ఓటు బ్యాంక్ ని ఎలా కాపాడుకునేది అనే ఆలోచనలో పడ్డారు టీడీపీ నేతలు.
పవన్ ,బీజేపీ వైఖరులు మార్చుకోవడం వలన పవన్ ఒంటరిగా పోటీ చేయడం వలన టీడీపీకి పడే కాపు ఓటు బ్యాంకింగ్ అదే విధంగా టీడీపీని వీడి వెళ్లాలని చూస్తున్న ఓటు బ్యాంక్ లు అన్నీ పవన్ కి అనుకూలంగా మారనున్నాయని తెలుస్తోంది.దాంతో టీడీపీ కి ఈ సారి కోలుకోలేని దెబ్బే తగులుతుందని అంటున్నారు.
ఇదిలాఉంటే ఉభయ గోదావరి జిల్లాలలో అదేవిధంగా కృష్ణా జిల్లా లో సైతం కొన్ని కొన్ని నియోజకవర్గాలలో పవన్ కళ్యాణ్ కి ఎంతో బలమైన ఓటు బ్యాంక్ ఉంది.ఇక పొతే

నెల్లూరు జిల్లాలో , ఉత్తరాంధ్ర జిల్లాలలో ఈ సారి పవన్ కళ్యాణ్ కి అభిమానుల ఓటు బ్యాంక్ భారీగానే ఉండటంతో పాటు అభిమానులు తీర్మానాలు కూడా చేసుకుంటున్నారట.ఇదే విషయాన్ని ఇంటలిజెన్స్ కూడా టీడీపీ కి తెలిపిందని టాక్ వినిపిస్తోంది.దాంతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.
పవన్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నేతలకి ఈ భయం పీక్ స్టేజ్ కి వెళ్లిందని అంటున్నారు.అంతేకాదు టీడీపీ ,కాంగ్రెస్ ల కలయిక ఏపీలో టీడీపీ పై తీవ్రమైన ప్రభావం చూపనుందని కూడా టాక్ వినిపిస్తోంది.
ఇదే అంశాన్ని పవన్ సైతం ఎత్తుకోవడంతో టీడీపీ నేతలు మరింత ఆందోళనకి లోనవుతున్నారని తెలుస్తోంది.







