దడ దడలు పుట్టిస్తున్న రెబెల్స్ ! కంగారుపడిపోతున్న పార్టీలు

రెబెల్స్ రెబెల్స్ ! ఈ పేరు చెప్తే చాలు పార్టీలు ఇప్పుడు వణికిపోతున్నాయి.ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం ఒక ఎత్తయితే… పార్టీ టికెట్ దక్కని వారి వ్యవహారం మరో వైపు తల బొప్పి కట్టిస్తున్నాయి.

 Elections In Telangana Heats Up With The Rebels-TeluguStop.com

ముందు ఇంట్లో అసమ్మతిని బయటకి తోలేస్తే… తరవాత వీధిలో పోరు ఎదుర్కోవచ్చనే ఆలోచనలో ఆయా పార్టీలు ఉన్నాయి.కానీ ఈ వ్యవహారం ఒక పట్టాన తేలేలా కనిపించడంలేదు.ముఖ్యంగా… అసమ్మతి నేతల బెడద మహాకూటమిని ఇబ్బంది పెట్టేస్తోంది.కూటమిగా ఏర్పడిన పార్టీలతో అధికారం దక్కించుకోవడం ఖాయమనుకున్న నాయకులు… తాజా వ్యవహారాలతో దిక్కుతోచని స్థితిలోపడిపోయారు.

టికెట్ దక్కని నాయకులంతా … ఆయా పార్టీలపై గుర్రుగా ఉన్నారు.తాము పార్టీ కోసం చాలా కష్టపడి పని చేశామని మాకెందుకు టికెట్ ఇవ్వరు అంటూ మేము ఖచ్చితంగా… పోటీచేస్తామంటూ అధిష్ఠానానికి సంకేతాలు పంపుతుండటంతో బరిలో నిలచే నాయకుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి.మహాకూటమి పొత్తులతో అసంతృప్తిగా ఉన్న ఆశావహులు రెబెల్‌గా నిలిచేందుకే సిద్ధం అవుతున్నారు.మహాకూటమిగా ఏర్పడడం తమకు ఇష్టం లేకపోయినా… పొత్తులు పెట్టుకొని తమ రాజకీయ జీవితాలకు చెక్ పెడతారా అంటూ కాంగ్రెస్ ఆశావహులు అధిష్ఠానం నిర్ణయాన్నితప్పుపడుతున్నారు.
తాము ఓడిపోయినా సరే తమను కాదని … ఢిల్లీ నుంచి హైకమాండ్ సెలెక్ట్ చేసిన అభ్యర్థులను ఓడించి తీరుతామంటూ ప్రకటనలు చేస్తున్నారు.

నియోజకవర్గంలోనూ పొసగని పొత్తులతో ఆశావహులు ప్రజల మధ్యే తేల్చుకుంటామంటున్నారు.స్టేషన్‌ఘన్‌పూర్‌ టికెట్‌ ఇందిరకు కేటాయించడంతో దానిపై ఆశపెట్టుకున్న విజయరామారావు రెబెల్‌గా పోటీ చేస్తామంటున్నారు.వరంగల్‌ పశ్చిమపై ఆశతో అన్ని విధాలా కాంగ్రెస్‌కు సహకరిస్తూ వస్తున్న డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి కూడా రేవూరికి వార్నింగ్‌ ఇస్తున్నారు.

ఇక శేరిలింగంపల్లి నుంచి బిక్షపతి యాదవ్‌, దుబ్బాక నుంచి ముత్యం శ్రీనివాసరెడ్డి, కోదాడ నుంచి బొల్లా మల్లయ్యయాదవ్‌, జడ్చర్ల నుంచి అనిరుద్‌రెడ్డి, మంచిర్యాల నుంచి అరవింద్‌రెడ్డి, బాన్సువాడ నుంచి మల్యాద్రిరెడ్డి, ఆలేరు నుంచి రామచంద్రారెడ్డి ఇండిపెండెంట్‌గా నిలబడుతామని ఇప్పటికే ప్రకటించేశారు.ఇలా ఎక్కడిక్కడ రెబెల్స్ బెడద పెరిగిపోవడంతో… మహాకూటమిలో ఉన్న పార్టీలకు తలనొప్పిగా మారింది.అయితే ఈ విషయంలో టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మెరుగయ్యిందనే చెప్పాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube