దేశ వ్యాప్తంగా ప్రస్తుతం మీటూ రచ్చ ఏ స్థాయిలో జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.విదేశాలకు మాత్రమే పరిమితం అయిన మీటూ ఇండియాలో ఇంతగా ప్రాచుర్యం పొందడానికి ప్రధాన కారణం తనూశ్రీ దత్తా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆమె బాలీవుడ్ స్టార్ నటుడు నానా పటేకర్ పై చేసిన ఆరోపణలతో ఇండియాలో మీటూ వివాదం మొదలైంది.ఎంతో మంది స్టార్స్ మరియు మహిళలు మీడియా ముందుకు వచ్చి మీటూ అంటూ తమపై జరిగిన లైంగిక దాడిని చెబుతున్నారు.
మరి కొందరు సోషల్ మీడియాలో మీటూ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు.

భారీ ఎత్తున ప్రస్తుతం మీటూ ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తనూశ్రీ దత్తా ఏం చేస్తుందా అని కొందరు ఆసక్తిగా ఆమె గురించి వెదుకుతున్నారు.దేశంలో చిచ్చు రేపిన తనూశ్రీ దత్తా ప్రస్తుతం ప్రశాంతత కోసం పూణె శివారులో ఉన్న ఒక రిసార్టులో యోగా చేస్తూ కనిపించింది.తనూశ్రీ దత్తా చేసిన ఆరోపణల వేడి ఇంకా చల్లారలేదు.
మరో వైపు రాఖీ సావంత్ నుండి తనూశ్రీ దత్తాపై బాంబులు పడుతూనే ఉన్నాయి.

తనూశ్రీ దత్తాను ఒక లెస్బియన్ అంటూ, డ్రగ్స్ తీసుకుంటుందంటూ రాఖీ సావంత్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే.ఈ నేపథ్యంలో రాఖీసావంత్ పై పరువు నష్టం దావా కూడా వేసిన తనూశ్రీ దత్తా కోర్టులో పోరాడేందుకు సిద్దం అయ్యింది.లైంగిక వేదింపుల ఆరోపణలు చేసిన తనూశ్రీ దత్తాకు ఎంతో మంది హీరోయిన్స్ మద్దతు పలికారు.
గత కొన్ని రోజులుగా చాలా బిజీ బిజీగా గడిపిన తనూశ్రీ దత్తా తాజాగా ఇలా యోగా చేసుకుంటూ కనిపించడం అందరిని ఆశ్చర్యంకు గురి చేసింది.
సోషల్ మీడియాలో ప్రస్తుతం తనూశ్రీ దత్తాకు సంబంధించిన విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
సోషల్ మీడియాలో తనూశ్రీ దత్తా యోగాపై మీమ్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి.అవి తెగ నవ్వు తెప్పిస్తున్నాయి.







