జగన్ మలివిడత పాదయాత్ర కి భారీ ఏర్పాట్లు..

వైసీపీ అధినేత జగన్ భుజానికి గాయం అయిన నాటినుంచీ జగన్ ని చూసుకోవడం కుదరలేదని కేవలం ఆరోజు టీవీలలో చూడటమే తప్ప మళ్ళీ ఇప్పటికి తమ అభిమాన నాయకుడిని చూసుకోలేక పోతున్నామని జగన్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అయితే మళ్ళీ జగన్ ఎప్పుడెప్పుడు పాదయాత్రకి వస్తాడోనని ఎంతో ఆత్రుతగా , ఉత్ఖంటగా ఎదురు చేస్తున్నారు అభిమానులు…అయితే ఇదే సమయంలోనిన్నటి రోజున జగన్ ని పరీక్షించిన వైద్యులు జగన్ కొన్ని రోజులు ఇంకా రెస్ట్ తీసుకోవాలని సూచించారు.

 Ys Jagan Next Padayatra Schedule Released Telugu-TeluguStop.com

అయితే తన అభిమాన ప్రజల కోసం.

జగన్ మొహన్ రెడ్డి పాదయాత్రని త్వరలోనే పునఃప్రారంభం చేయాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.గాయం కారణంగా పాదయాత్రకి బ్రేక్ పడిందని సంబరపడుతున్న టీడీపీ నేతలకి జగన్ నిర్ణయం షాక్ ఇచ్చింది.పలుమార్లు జగన్ వైద్యులను పాదయాత్ర విషయంలో వెళ్ళాలని కోరగా భుజంపై భారం పడకుండా యాత్ర చేపట్ట వచ్చునని తెలపడంతో.

గాయం అయిన భుజం కదలకుండా మెడ నుంచీ కట్టు కట్టుకుని పాదయాత్ర చేయడానికి జగన్ సిద్దమవుతున్నారని టాక్ జోరుగా వినిపిస్తోంది.

అందులో భాగంగానే గత గురువారం ఆగిన జగన్ యాత్ర మళ్లీ విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం

మక్కువ గ్రామం నుంచి కొనసాగించనున్నారు.ఈసారి జగన్ యాత్రకు భారీ భద్రతని ఏర్పాటు చేయాలని వైసీపీ శ్రేణులు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది…శ్రేణులు కూడా జగన్ రాకకోసం వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్నామని అంటున్నారు…దాంతో ప్రస్తుతం విజయనగరం శివారులో ఉన్న యాత్ర త్వరలోనే శ్రీకాకుళం జిల్లా లో అడుగుపెట్టనుంది.

ఇదిలాఉంటే ఈ సారి పాదయాత్రలో జగన్ కి ప్రజలు విపరీతమైన బ్రహ్మరధం పట్టే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.

ఇప్పటికే భారీ స్థాయిలో ప్రజలు వస్తుండగా ఈ సారి జరిగిన దాడి నేపధ్యంలో జగన్ ని చూడటానికి మరింతమంది ప్రజలు వచ్చే అవకాశం లేకపోలేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాదు జగన్ తన ఈ సారి తన ప్రసంగాలలో తనపై దాడి నేపధ్యం గురించి చెప్తూ టీడీపీ ప్రభుత్వాన్ని , చంద్రబాబు ,మంత్రుల్ని ఉతికి ఆరేస్తారని.

మలివిడత జగన్ చేపట్టబోయే ఈ యాత్ర భారీ విజయం అవ్వడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube