దేశంలో కోటేశ్వరావులు పెరిగారట !

మన దేశంలో కోటీశ్వరుల సంఖ్య ఈ మధ్యకాలంలో బాగా పెరిగిందది.ఏడాదికి రూ.కోటికి పైగా ఆదాయం గడించే వారి సంఖ్య 1.40లక్షలకు పైనే ఉందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల సంస్థ(సీబీడీటీ) సోమవారం వెల్లడించింది.గత నాలుగేళ్లుగా ఆదాయపు పన్ను చెల్లించేవారి వివరాల ఆధారంగా సీబీడీటీ ఈ గణాంకాలు విడుదల చేసింది.

 Money In The Country Number Of People Increased-TeluguStop.com

‘రూ.కోటి అంతకంటే ఎక్కువ ఆదాయం గడిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.2014-15 అసెస్‌మెంట్‌ సంవత్సరంలో 88,649 మంది పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయాన్ని రూ.కోటి అంతకంటే ఎక్కువగా చూపగా.2017-18 అసెస్‌మెంట్‌ సంవత్సరం నాటికి వీరి సంఖ్య 1,40,139కి పెరిగింది.నాలుగేళ్లలో కోటీశ్వరుల సంఖ్య 60శాతం పెరిగింది’ అని సీబీడీటీ తెలిపింది.

వీరిలో వ్యక్తులు, సంస్థలు, ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి.ఇక రూ.కోటి అంతకంటే ఎక్కువ ఆదాయం గడిస్తున్న వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల సంఖ్య కూడా 48,416 నుంచి 81,344కు పెరిగింది అని సీబీడీటీ గణాంకాలు వెల్లడించాయి.ఇక రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య కూడా బాగా పెరిగిందని సీబీడీటీ తెలిపింది.2013-14 ఆర్థిక సంవత్సరంలో 3.79కోట్ల మంది రిటర్నులు దాఖలు చేయగా.2017-18 నాటికి ఆ సంఖ్య 6.85కోట్లకు పెరిగిందని సీబీడీటీ పేర్కొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube