ఛీ... కుక్కకు సారి చెప్పలేదని ఓ వ్యక్తిని చంపేశారు !

కుక్కకు ఉన్న విలువ సాటి మనుషులకు లేకుండా పోయింది.మూగజీవాల మీద ప్రేమ ఉండవచ్చు కానీ సాటి మనిషి ప్రాణాలు తీసే అంత రేంజ్ లో ప్రేమ ఉండడం నిజంగా ఉన్మాదమే అవుతుంది.

 A Man Has Been Killed For Not Apologizing To The Dog-TeluguStop.com

అలాంటి ఉన్మాద చర్యే దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.వివరాల్లోకి వెళ్తే… ఉత్తమ్‌నగర్‌ ప్రాంతంలో అంకిత్‌, పరాస్‌, దేవ్‌ చోప్రా అనే ముగ్గురు స్నేహితులు ఓ పెంపుడు కుక్కతో కలిసి వెళ్తున్నారు… అదే ప్రాంతంలో విజేందర్‌ రాణా అనే ట్రక్కు డ్రైవర్‌ వేగంగా తన వాహనంతో వారి పక్కగా వెళ్లాడు.

ఆ వేగానికి భయపడిన కుక్క, ట్రక్కును చూసి మొరిగింది.దీనిపై ఆగ్రహం చేందిన ఆ ముగ్గురు వ్యక్తులు రాణాను పట్టుకుని ముందు కుక్కకు సారీ చెప్పాలని హెచ్చరించారు… అందుకు డ్రైవర్ రాణా అంగీకరించకపోవడంతో ఆ ముగ్గురు కత్తులు, స్ర్కూడ్రైవర్లతో విచక్షణారహితంగా దాడిచేశారు… అడ్డుకునేందుకు యత్నించిన రాణా సోదరుడు రాజేష్‌పై కూడా దాడిచేశారు.ఆ దాడిలో రాణా ఘటనా స్థలంలోనే మృతిచెందగా… రాజేష్‌ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరాడు.పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube