విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘నోటా’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ప్రస్తుతం విజయ్ దేవరకొండకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ నేపత్యంలో ‘నోటా’ చిత్రం భారీగా వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.
రికార్డు స్థాయిలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.ఇక ఈ చిత్రం తర్వాత ‘డియర్ కామ్రెడ్’ చిత్రాన్ని విజయ్ దేవరకొండ చేస్తున్నాడు.
వచ్చే ఏడాది వేసవిలో ఆ చిత్రం వచ్చే అవకాశం ఉంది.విజయ్ దేవరకొండ ఆ తర్వాత మైత్రి మూవీస్ బ్యానర్‌లో ఒక చిత్రం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటూ సమాచారం అందుతుంది.

మైత్రి మూవీస్ వారి బ్యానర్‌లో చేయబోతున్న ఆ చిత్రంకు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది.ఆ వార్త ఏంటీ అంటే ఈ చిత్రంలో శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేయబోతున్నారు.అందుకు సంబంధించిన చర్చలు మైత్రి మూవీస్ వారు బోణీ కపూర్‌తో చేస్తున్నారు అంటూ ప్రచారం జరిగింది.శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌తో విజయ్ దేవరకొండ మూవీ అంటూ భారీ ఎత్తున పబ్లిసిటీ జరిగిన నేపథ్యంలో అందరి దృష్టి ఈ చిత్రంపై పడినది.

తాజాగా జాన్వీ ఈ విషయమై సోషల్ మీడియా ద్వారా స్పందించింది.తాను సౌత్‌లో ఒక చిత్రంలో నటించబోతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంను కొట్టి పారేసింది.సౌత్ నుండి తనకు ఆఫర్ వచ్చినట్లుగా జరుగుతున్న ప్రచారం కూడా నిజం కాదని ఆమె పేర్కొంది.అయినా తాను ఇప్పట్లో సౌత్‌కు వెళ్లాలని భావించడం లేదంటూ ప్రకటించింది.
ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న తాను సౌత్ సినిమాల గురించి ఆలోచించే సమయం లేదు అంటూ చెప్పుకొచ్చింది.సౌత్‌లో ఇప్పట్లో నటించను అంటూ తేల్చి చెప్పిన జాన్వీ భవిష్యత్తు గురించి తాను ఇప్పటి నుండే చెప్పలేను అంది.
మొత్తానికి విజయ్ దేవరకొండతో జాన్వీ కపూర్‌ను చూస్తామని ఆశ పడ్డ ప్రేక్షకులకు నిరాశే మిగిలింది.







