హమ్మయ్య ! కేసీఆర్ ప్రకటించిన ఆ అభ్యర్థుల లిస్ట్ లో నా పేరు వచ్చేసింది.ఇక తిరుగులేదు.
ఎన్నికల సమయం వరకు ప్రజల్లో తిరుగుతూ పలుకుబడి పెంచుకుంటే మళ్ళీ అసెంబ్లీలో కూర్చోవచ్చు.అని ధీమాగా కలలుకంటున్న టీఆర్ఎస్ అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ గట్టి షాక్ ఇచ్చాడు.
టికెట్ కేటాయించినా వారికి చివరి దాకా ఉంటుందా ? ఊడుతుందా ? అనే సందిగ్ధంలో వారిని పెట్టేసాడు.ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థుల అందరిపై మరోసారి సర్వే చేయిస్తుండడం .ఆ సర్వే ఫలితాలకు అనుగుణంగా అభ్యర్థుల మార్పు చేర్పులు చేపడతానని ప్రకటించడం వారికి ఆందోళన కలిగిస్తోంది.

ఎందుకంటే ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులపై చాలా ఇమర్శలు వస్తుండడంతో పాటు సిట్టింగ్ ఎమ్యెల్యేలపై ప్రజల్లో ఆగ్రహం ఉందని, కచ్చితంగా పార్టీకి అది చేటు తెచ్చే అంశమని కేసీఆర్ కి వివిధ రిపోర్టులు అందుతున్నాయి.ఈ నేపథ్యంలో టికెట్లు ప్రకటించిన వారందరికీ బీ ఫార్మ్ ఇవ్వకుండా.మరోసారి సర్వే చేపట్టి మార్పు చేర్పులు చేయాలనీ కేసీఆర్ ప్లాన్.
నియోజకవర్గాల్లో ప్రజల ఆమోదం పొందని వారికి టికెట్ ఇస్తే మెజార్టీ అందుకోలేకపోతారన్న అనుమానంతో అభ్యర్థుల గురించి కేసిఆర్ ఎప్పటికపుడు సర్వేలు చేయిస్తున్నారు.ప్రజల్లో వస్తున్న సానుకూల వాతావరణం గురించి ఎప్పటికపుడు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఓ సర్వే టీమ్ ని కేసీఆర్ పురమాయించినట్లు తెలుస్తోంది.
కేసీఆర్ చేయిస్తున్న సర్వేలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, ఖానాపూర్, మంచిర్యాల, చెన్నూరు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో హుజుర్నగర్, కరీంనగర్ జిల్లాలో వేములవాడ, కోరుట్ల, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్ జిల్లాలో ములుగు, భూపాలపల్లి, మహాబుబాబాద్ నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రత్యేకంగా సర్వే చేయిస్తున్నారు.మొదటి విడత సర్వేలో ఈ నియోజకవర్గాలతో పాటు మరికొన్ని నియోజకవర్గాలు ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికే ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జ్ ల పనితీరుపై ఎప్పటికపుడు సర్వేలు చేయిస్తున్నారు.సర్వేలో గెలిచే అభ్యర్థులు గెలుపు అంచుల్లో ఉన్న వారు ఓటమి దిశలో పయనించే వారి వివరాలను ప్రత్యేకంగా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.

పొలిటికల్ ఇంటెలిజెన్స్, పోలీస్ ఇంటెలిజెన్స్ తో పాటు ప్రత్యేకంగా ఓ సర్వే టీంను కూడా రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.సర్వేల ఆధారంగా అభ్యర్థులకు బీ ఫాంలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటి వరకు కేసీఆర్ చేయించిన సర్వేలు బయటకు వచ్చినప్పటికీ అభ్యర్థుల ప్రకటన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా సర్వేలు చేయిస్తున్నారు.ఈ విషయంలో ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా కఠినంగా వ్యవహరించాలని కేసీఆర్ డిసైడ్ అయ్యాడు.







