అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎక్సలెన్స్ ఐయూఎ్‌సఎఫ్ అవార్డుని తెలుగు ఫోటో జర్నలిస్ట్ అయిన తమ్మా శ్రీనివాస్ రెడ్డి ని వరించింది.ప్రపంచ వ్యాప్తంగా కేవలం నలుగురికి మాత్రమే ఇచ్చే ఈ అవార్డుకి తెలుగు వ్యక్తి ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందని అమెరికాలోని తెలుగు సంఘాలు పేర్కొన్నాయి.
ఇదిలాఉంటే తమ్మా శ్రీనివాసరెడ్డి ఫోటో గ్రఫీ లో ఎంతో ప్రతిభ కలిగిన వ్యక్తని ఎనలేని ప్రతిభ ఆయన సొంతమని ఫోటోగ్రఫీ ప్రియులు చెప్తున్నారు.

అయితే ఈ అరుదైన అవార్డుకి భారత్ నుంచీ శ్రీనివాసరెడ్డిని వరించిందని ఐసీఎస్ వ్యవస్థాపకుడు టోనీ లీ కిమ్ థుయాన్ వెల్లడించారు…ఈ ఫోటీ లో ఎంతో మంది ఎన్నో ఫోటోలని పంపారని.లక్షల సంఖ్యలో ఫోటోలు తమకి అందాయని అయితే అందరిని వడపోసి చూడగా శ్రీనివాస్ రెడ్డి ఎంపిక జరిగిందని ఆయన తెలిపారు.అయితే నవంబరులో జరగనున్న అంతర్జాతీయ ఫొటోగ్రఫీ కన్వెన్షన్‌లో ఈ అవార్డును అందజేస్తామని తెలిపారు.

ఇదిలాఉంటే ఇప్పటికే శ్రీనివాసరెడ్డి 3 ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ ఫొటోగ్రఫీ అవార్డులు అందుకున్నారు…గత పాతికేళ్లలో 168 బంగారు పతకాలు.497 అవార్డులు…876 గౌరవసత్కారాలు లభించాయి.ప్రస్తుతం ఆయన ఇండియా ఇంటర్నేషనల్ ఫొటోగ్రాఫిక్ కౌన్సిల్‌కు అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నారు.







