జగన్ ప్రభంజనం గోదావరి జిల్లాల్లో కనిపించబోతోందా ..

ఎన్నో వివాదాలు.మరెన్నో సంచలనాలు ఇలా అన్నిటిని దాటుకుని మొత్తానికి వైసీపీ అధ్యక్షుడు జగన్ పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాను దాటేసింది.

 Ys Jagan Praja Sankalpa Yatra Craze At Godavari District-TeluguStop.com

ఈ రోజే ఆయన యాత్ర విశాఖ జిల్లాలోకి అడుగుపెట్టింది.జగన్ ఇప్పటి వరకు యాత్ర పూర్తి చేసిన జిల్లాలు ఒక ఎత్తు అయితే.

ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజాసంకల్ప యాత్ర ఓ ఎత్తు.ఎందుకంటే, ‘కాపు రిజర్వేషన్ల’ అంశంపై వైఎస్‌ జగన్‌ ఎలా స్పందిస్తారు.? 2014 ఎన్నికల్లో ఈ జిల్లాల నుంచే అధికార తెలుగుదేశం పార్టీకి అత్యధిక సీట్లు దక్కిన నేపథ్యంలో జగన్ యాత్ర ప్రభావం ఎంతవరకు ఉంది అనేది లెక్కలు వేసుకునే పనిలో ఉన్నాయి మిగతా రాజకీయ పార్టీలు.

తూర్పు గోదావరి జిల్లాలో.అదీ కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉండే జగ్గంపేట నియోజకవర్గం లో వైఎస్‌ జగన్‌, కాపు రిజర్వేషన్లపై మాట్లాడాల్సి వచ్చింది.జగన్‌ మాట్లాడిన మాటల్ని తెలుగుదేశం పార్టీ వివాదాస్పదం చేయడం, దాంతో ప్రజాసంకల్ప యాత్రలో కొంత గందరగోళం చేసుకోవడం జరిగిపోయాయి.

మొత్తానికి చూస్తే, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ప్రజాసంకల్ప యాత్ర అంచనాలకు మించి విజయవంతమయ్యిందని వైఎస్సార్సీపీ గట్టి నమ్మకంతో చెబుతోంది.

జగన్ పాదయాత్ర పూర్తి చేసిన గోదావరి జిల్లాల్లో ప్రజల నాడి ఏ విధంగా ఉంది అనే విషయంపై ఆ పార్టీ అంతర్గతంగా సర్వే కూడా చేయించుకుంది.

దాంట్లో వైసీపీ కి అనుకూలంగా రిపోర్ట్స్ రావడం, కాపు రిజర్వేషన్స్ పై జగన్ వైకిరి చెప్పినా నిజాయితీగా మాట్లాడాడని , చంద్రబాబు లా మోసపూరిత హామీలు ఇవ్వలేదని జనం బాగా నమ్మినట్టు ఆ రిపోర్టులో ఉందట.అందీ కాదు వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కూడా గెలిచే అవకాశం ఉన్నట్టు కూడా తేలడంతో జగన్ లో ఆత్మస్తైరం పెరిగినట్టు తెలుస్తోంది.

ఈ మధ్య పొలిటికల్ స్పీడ్ పెంచిన జనసేనాని సభలకు భారీ స్థాయిలో జనాలు హాజరవుతున్నా చాలామంది కి పవన్ మీద ఇంకా పూర్తి స్థాయిలో నమ్మకం కలగలేదట.అదీ కాకుండా జనసేన గ్రామస్థాయిలో ఇంకా బలపడకపోవడం ఆ పార్టీ కి పెద్ద ఎదురుదెబ్బగా మారిందని జగన్ సర్వేల్లో తేలిందని వైసీపీ వర్గాల సమాచారం.గోదావరి జిల్లాల్లో టీడీపీ వర్సెస్ వైసీపీ పోరు హోరాహోరీగా ఉన్నా .వైసీపీకే మెజార్టీ సీట్లు వస్తాయనే లెక్కల్లో జగన్ ఉన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube