లోదుస్తుల వ్యాపారమా..? అని నవ్వారు! కానీ ఈ విషయాలు తెలిసాక..!

దుస్తులు ఆకట్టుకునేలా కనిపించాలని, వైవిధ్యంగా, ట్రెండీగా ఉండాలని కోరుకునే చాలామంది అమ్మాయిలు.లోదుస్తుల్ని మాత్రం ఏవో ఒకటి ఎంచుకుంటారు.

 Inspiring Stories Of Arpita Ganesh-TeluguStop.com

తప్ప పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు.ఆ నిర్లక్ష్యం అసౌకర్యానికే కాదు.

ఆకృతిపైనా ప్రభావం చూపిస్తుందంటారు అర్పితా గణేష్‌.దానికి పరిష్కారంగా బటర్‌కప్స్‌ సేవల్ని అందుబాటులోకి తెచ్చారు.

ప్రత్యేకంగా ప్రశ్నావళి అందించి.సందర్భం, ఆకృతికి తగిన లోదుస్తుల్ని అందిస్తున్నారు.

అది ఆమెకు వినియోగదారుల సంఖ్యను పెంచడమే కాదు, ఇటీవల గూగుల్‌ నుంచి స్మాల్‌ బిజినెస్‌ హీరోస్‌ అవార్డునూ తెచ్చిపెట్టింది.

మన దేశంలో ఎనభై శాతం అమ్మాయిలు వారికి సరిగ్గా నప్పే లోదుస్తులు వేసుకోరని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి.లో దుస్తులు అన్ని సైజుల్లో అందరికీ అందుబాటులో లేకపోవడం, ఎవరికి ఎలాంటివి సరిపోతాయో అనే అవగాహన లేకపోవడమే అందుకు ప్రధాన కారణం.పైగా మన దేశంలో లోదుస్తుల గురించి చాలామంది బహిరంగంగా మాట్లాడరు.

ఇప్పటికీ చదువుకున్న అమ్మాయిలు కూడా వాటిని కొనుక్కోవడానికి సిగ్గుపడతారు.ఇవన్నీ గమనించి, వాళ్ల అవసరాలకు తగ్గట్టుగా వాటిని అందుబాటులోకి తెస్తున్నా.

అయితే ఏవో ఒకటని కాకుండా.సందర్భం, అవసరానికి తగినట్టుగా అందించడం మా ప్రత్యేకత.

ఒకవేళ అంతర్జాలంలో కొనుగోలు చేయాలనుకుంటే, మా వెబ్‌సైట్లోకి వెళ్తే కొన్ని ప్రశ్నలుంటాయి.వాటి ఆధారంగా వాళ్లకు నప్పే రకాలను ఆర్డరిచ్చుకుంటే ఇంటికి పంపిస్తాం.

అలాగే బెంగళూరులో ఉన్న మా బొతిక్‌ల నుంచి కూడా కొనుక్కోవచ్చు.అక్కడ రెండు బొతిక్‌లున్నాయి.

సందేహాలుంటే గనుక, నిపుణుల సలహాలూ అందించే ఏర్పాటు కూడా చేశా.ఇదంతా ఒక్కరోజులో జరగలేదు.

ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.

మాది బెంగళూరు.

పుట్టింది అక్కడే అయినా హైదరాబాద్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తిచేశా.ఓసారి న్యూయార్క్‌ వెళ్లా.

అక్కడ ఎదురైన చిన్న సంఘటనే నన్ను ఈ సంస్థను ప్రారంభించేలా చేసింది.అక్కడో బొతిక్‌కి వెళ్లి నా ఆకృతికి సరిపోయే లోదుస్తులు కావాలని అడిగా.

వాళ్లు నాతో మాట్లాడి…సరిగ్గా నాకు నప్పేవే అందించారు.చాలా సౌకర్యంగా అనిపించాయి.

ఇక్కడకు వచ్చాక అలాంటి సేవల్నే నేనూ ప్రారంభించాలనుకున్నా.అలా పదిహేనేళ్లక్రితం ఈ సేవల్ని అందుబాటులోకి తెచ్చా…

ఎవరూ ముందుకు రాలేదు…

అంతర్జాతీయంగా మొత్తం 150 సైజుల్లో లోదుస్తులు లభిస్తుంటే మన దేశంలో ఆ సంఖ్య కేవలం 40కే పరిమితమైంది.ఆ సంఖ్యను నేను పెంచాలనుకున్నా.శరీరాకృతికి తగినట్లుగా మాత్రమే కాదు.

సందర్భం, అవసరానికి సరిపోయే రకాలనూ అందుబాటులోకి తేవాలనుకున్నా.మొదట్లో నాకు బొతిక్‌ పెట్టాలన్న ఆలోచన వచ్చిన మాట వాస్తవమే కానీ అప్పుడు నా దగ్గర సరిపడా పెట్టుబడి లేదు.

దానికోసం ఏదైనా చేయాలనుకున్నా.బాగా ఆలోచించాక…

వినియోగదారుల నమ్మకమే నా వ్యాపారానికి పెట్టుబడి అనుకున్నా.

అందుకే ప్రీ ఆర్డర్‌ అనే విధానాన్ని ప్రారంభించాను.అంటే వినియోగదారుల నుంచి మొదట కొంత డబ్బు తీసుకున్నా.

సంస్థకు ఓ రూపం వచ్చాక.లోదుస్తుల్ని అందిస్తానని చెప్పా.

నేను అనుకున్నట్లుగా నా వ్యాపారం ప్రారంభించకపోతే వారికి డబ్బు తిరిగిచ్చేస్తానని కూడా చెప్పా.దానికోసం సామాజిక మాధ్యమాలను ఎంచుకున్నాను.

ఒక పోస్ట్‌ రాసి దాన్ని నా స్నేహితులూ, తెలిసినవారికీ పంపా.వారిని కూడా షేర్‌ చేయమని అడిగా.

కొంతమంది అమ్మాయిలు వాళ్లకు తెలిసినవారికి చెప్పేవారు.వినియోగదారులు పెరిగారు.

చివరికి 200మంది మహిళలు ఒక్కొక్కరు 1500 రూపాయల చొప్పున నన్ను నమ్మి నాకు డబ్బు ఇచ్చారు.అదే నా సంస్థకు మొదటి పెట్టుబడి.

కానీ అంతకన్నా ముందు డబ్బు కోసం చాలా కంపెనీలకు వెళ్లేదాన్ని.అయితే అక్కడున్న వారంతా అబ్బాయిలు కావడంతో అసలు లోదుస్తుల గురించి తెలియక ఈ వ్యాపారంలో పెట్టుబడి ఎందుకు పెట్టాలని అడిగేవారు.

ఏదయితేనేం.మహిళల సాయంతోనే పదిహేనేళ్లక్రితం ఈ సంస్థను ప్రారంభించా.

కానీ అది అనుకున్నంత సజావుగా సాగలేదు.

ఇతర కంపెనీల నుంచి.
కంపెనీని ప్రారంభించడం సరే కానీ.అసలు లోదుస్తుల కోసమే అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటని అడిగారు చాలామంది.అదో వ్యాపారమా అన్నవాళ్లూ ఉన్నారు.దానికితోడు మొదట్లో అనుకున్న ఫలితాలు కూడా రాలేదు.

ఒకానొక సమయంలో అయితే.సంస్థను మూసేసి వేరే ప్రాంతానికి వెళ్లిపోవాలనుకున్నా.

కానీ అలా చేయడం వల్ల ప్రత్యేకత ఏముంటుందని అనిపించింది.అందుకే మళ్లీ ఆలోచించా.

లోదుస్తుల అవసరాన్ని తెలియజేయడానికి వివిధ కార్పొరేట్‌ సంస్థలకు వెళ్లా.అక్కడ మహిళల కోసం ఉచితంగా వర్క్‌షాపులు కూడా నిర్వహించాను.

వర్క్‌షాప్‌కు వచ్చిన ప్రతి ఒక్కరూ ‘మాకు తెలియని చాలా విషయాలు నేర్చుకున్నాం.’ అనేవరు.

క్రమంగా వినియోగదారులు పెరిగారు.ఇప్పుడు మా వినియోగదారులు మూడువేలమంది ఉన్నారు.

ఈ సంఖ్యను ఇంకా పెంచడమే నా లక్ష్యం.మొదట్లో వేరే కంపెనీలకు వివిధ సైజుల్లో డిజైన్లు పంపిస్తే వాళ్లే తయారు చేసి ఇచ్చేవారు.

వినియోగదారుల సంఖ్య పెరిగేకొద్దీ కష్టం అనిపించింది.అందుకే నేనే సొంతంగా తయారీ చేయాలనుకున్నా.

యూనిట్‌నీ ఏర్పాటు చేశా.కొన్ని అంతర్జాతీయ సంస్థలతోనూ కలిసి పనిచేస్తున్నా.

ఇలా కొనుక్కోవచ్చు…
ఆన్‌లైన్‌లో మా బటర్‌కప్స్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ‘టేక్‌ అవర్‌ క్విజ్‌’ ఆప్షన్‌ ద్వారా అక్కడడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.ఆ తర్వాత ఆకృతికి సరిపోయే లోదుస్తులు వివిధ రకాల్లో ధరలతో సహా చూసి, నప్పేదాన్ని ఎంచుకోవచ్చు.

ఇదంతా ఆన్‌లైన్‌ ద్వారానే జరుగుతుంది.ఇలా కాకుండా నేరుగా వెళ్లి మనకు సరిపోయే లోదుస్తులు ప్రయత్నించి మరీ ఎంచుకోవడానికి మా బొతిక్‌కి రావచ్చు.

ప్రస్తుతం నెలకు దాదాపు 500 ఆర్డర్లు వస్తే అందులో సుమారు 60శాతం బొతిక్‌ల నుంచే వస్తున్నాయి.ఆన్‌లైన్‌లో హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై సహా ఇతర ప్రాంతాలనుంచీ ఆర్డర్లు వస్తున్నాయి.

దేశవ్యాప్తంగా నా సేవల్ని విస్తరించాలనేదే నా ఆలోచన.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube