అతిగా స్పందించారు.. కమల్‌కు తలనొప్పి తెప్పించారు

తెలుగు బిగ్‌బాస్‌ ఇంట్లోకి తమిళ బిగ్‌బాస్‌ హోస్ట్‌ వెళ్లడం అందరి దృష్టిని ఆకర్షించింది.

నాని హోస్టింగ్‌ చేస్తున్న తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2 సక్సెస్‌ ఫుల్‌గా కొనసాగుతున్న సమయంలో తమిళ బిగ్‌బాస్‌ హోస్ట్‌ అయిన కమల్‌ హాసన్‌ ప్రత్యేక అతిథిగా వెళ్లడంతో నిన్నటి ఎపిసోడ్‌పై అంచనాలు భారీగా పెరిగి పోయాయి.

అయితే ఇంటి సభ్యుల ఓవర్‌ రియాక్షన్‌ కారణంగా కమల్‌ హాసన్‌ ఉన్న కొద్ది సమయం వినియోగం కాలేదు అని చెప్పక తప్పదు.కమల్‌ హాసన్‌తో షేక్‌ హ్యాండ్స్‌కు, కౌగిలింతలకే సమయం ఎక్కువ అయ్యింది.

కమల్‌ హాసన్‌ రావడంతోనే అంతా కూడా షాక్‌ అయ్యారు.కమల్‌ వచ్చాడు అంటూ నాని ప్లాస్మాలో చెప్పగానే ఉరుకులు పరుగులతో ఇంటి సభ్యులు బయటకు వెళ్లారు.ఎంతగా అంటే ఆ సమయంలో రోల్‌ రైడా కింద కూడా పడ్డాడు అనే విషయం చూడవచ్చు.

కమల్‌ హాసన్‌ కాళ్లకు దండం పెట్టేందుకు అంతా కూడా పోటీ పడ్డారు.కమల్‌ హాసన్‌కు ఎక్కువ మర్యాదలు చేస్తూ ఆయన్ను కాస్త ఇబ్బందికి గురి చేశారు.ప్రతి ఒక్కరు ఆయన దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు.

Advertisement

కమల్‌ హాసన్‌ దృష్టిని ఆకర్షించేందుకు మీ అభిమానిని అంటూ లేదంటే మరేదో అంటూ సొల్లు ముచ్చట్లు చెప్పారు.ఇక రోల్‌ రైడా వెంటనే కమల్‌ హాసన్‌పై తనదైన శైలిలో పాట పాడేశాడు.

ఆ పాట వింటున్నంత సమయం కమల్‌ కాస్త చిరాకుగా అనిపించాడు.ఆ తర్వాత కూడా కమల్‌కు ఇంటి సభ్యులతో తలనొప్పి అనిపించిందని ఆయన హావభావాలు చూస్తుంటే అనిపించింది.

కమల్‌ హాసన్‌ ఎంట్రీతో ఇంట్లో కాస్త సందడి ఉంటుందని అనుకుంటే ఇంటి సభ్యులు మాత్రం సంభ్రమాశ్చర్యాలకు లోనై అసు కార్యక్రమం మిస్‌ అయ్యేలా చేశారు.

కమల్‌ ఇంటి సభ్యులతో సరదాగా కొద్ది సమయం చిన్న గేమ్‌ ఆడేలా ప్లాన్‌ చేశారు.కాని ఇంటి సభ్యులు ఆటకు వీలు పడనివ్వలేదు.ఇక కమల్‌ హాసన్‌ ఇంటి నుండి వెళ్లే సమయంలో అమిత్‌కు రెండు వారాల పాటు ఎలిమినేషన్‌లో లేకుండా ఉండే పవర్‌ ఇచ్చాడు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!

రాబోయే రెండు వారాల్లో అమిత్‌ ఎలిమినేషన్‌లో ఉండబోవడం లేదు.తెలుగు వాడు కాకున్నా కూడా తెలుగు చక్కగా నేర్చుకుని, తెలుగు వాడిలా మాట్లాడుతున్న కారణంగానే అమిత్‌కు తన కార్డు ఇచ్చాను అంటూ కమల్‌ ప్రకటించాడు.

Advertisement

మొత్తానికి కమల్‌ ప్రత్యేక అతిథిగా వచ్చిన ఎపిసోడ్‌ అలా అలా సాగిపోయింది.తాను అనుకున్న విశ్వరూపం 2 ప్రమోషన్‌ను మాత్రం కమల్‌ పొందాడని చెప్పుకోవచ్చు.

తాజా వార్తలు