ఏపీ సీఎం చంద్రబాబు ఈ నాలుగేళ్ల కాలంలో పార్టీ పైనా, ప్రభుత్వంపైనా పడిన మచ్చలను చెరిపేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు.నాలుగేళ్లుగా ప్రభుత్తంలో ఏర్పడిన లోపాలను పడే పడే ప్రతిపక్ష పార్టీ ఎత్తి చూపిస్తుండడంతో అది ప్రజల్లోకి బలంగా వెళ్ళాక ముందే ఆ మచ్చలను చెరిపేసుకుని ప్రజలకు క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.
కేంద్రం పై టీడీపీ ప్రస్తుతం చేస్తున్న విమర్శలను గుర్తు చేస్తూ… కేంద్రం రాష్ట్రానికి నాలుగేళ్ళుగా ఏమి చేయకపోయినా ఎన్డీయే లో ఎందుకు కొనసాగారన్నది ప్రజలనుంచి టిడిపి కి ఎదురౌతున్న ప్రశ్న.అందుకే ఆ ప్రశ్నలకు ధీటైన సమాధానం చెప్పేందుకు బాబు ప్రణాళికలు రచిస్తున్నాడు.

నాలుగేళ్ళ పాటు కేంద్ర ప్రభుత్వంతో అంటకాగి ఇప్పుడు విమర్శలు చేయడం … తామెలా నమ్ముతామని ప్రత్యర్థి పార్టీల అధినేతలు జగన్, పవన్ ల సూటిగా బాబు ప్రశ్నిస్తున్నారు.వీటికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు బాబు.ప్రజల్లోనే కాదు పార్టీ శ్రేణులకు దిశా నిర్ధేశం చేసేందుకు ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.గ్రామదర్శిని కార్యక్రమాల్లో క్లారిటీ ఇచ్చేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు.కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడం అనేక సమస్యలు చుట్టిముట్టి ఉండటంతో బిజెపి తో రాజీ పడక తప్పలేదని తేల్చేశారు చంద్రబాబు.

ఏపీ అభివృద్ధి కోసం బిజెపితో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని అయితే వారు మోసం చేశారని మరోసారి వ్యాఖ్యానించారు.ధర్మపోరాటం ఆగదని పోరాటం చేయడంలో తనకు మించిన వారు ఎవరున్నారని కూడా ప్రత్యర్థులకు సవాల్ విసిరారు చంద్రబాబు.నాలుగేళ్ళు ఓపిక పట్టి రాజీ పడుతూ వచ్చినా ఇక చివరిగా ప్రయోజనం లేదని అర్థమైందని అందుకే బయటకి వచ్చేశామని బాబు చెప్పుకొస్తున్నారు.
బిజెపితో తాను పడిన రాజీపడినా, విభేదించి బయటకి వచ్చేసినా అదంతా ప్రజలకోసమే అని చెప్పేందుకు బాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.అంతేకాదు సీనియర్ అయిన తనను ఎవరూ మోసం చేయలేరన్నారు.
తాను ఎవరి ట్రాప్ లో పడలేదని మరీ వివరణ ఇచ్చారు.
.






