జనసేనానికి సేఫ్ ప్లేస్ ఎక్కడ ...పోటీ చేయబోయేది ఇక్కడేనా..

జనసేన అధ్యక్షుడు పవన్ తన రాజకీయ యాత్ర విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు.

వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా పార్టీని కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ చేయాలనీ పవన్ ప్లాన్.

ఇప్పుడిప్పుడే పార్టీ పరిస్థితి మెరుగుపరుస్తున్న పవన్ పార్టీలో చేరికల మీద కూడా దృష్టి పెట్టి తాను పర్యటించిన ప్రతి చోటా తమ పార్టీలోకి ఎవరో ఒకరు ముఖ్యమైన నాయకుడు చేరేలా పవన్ ప్లాన్ వేస్తున్నాడు.ఇదే సమయంలో పవన్ ఎక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు అనే ఆసక్తి అందరిలోనూ కలుగుతోంది.

వచ్చే ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి జనసేన అధినేత బరిలోకి దిగబోతునట్టు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.అవి ఎక్కడ ఎక్కడ నుంచి అంటే.ఒకటి రాయలసీమ లోని అనంతపురం అని లెక్కేస్తుంటే మరొకటి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు అంటున్నారు.

ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ ఏలూరు, భీమవరం ప్రాంతాల్లోని సమస్యలనే ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు.అదీ కాకుండా హైదరాబాద్ లో వున్న పవన్ ఓటర్ కార్డు అడ్రెస్ ఏలూరు కి మార్పు చేయించేసాడు.

Advertisement

పవన్ ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలని కూడా ఆ పార్టీ అభిమానుల నుంచి వత్తిడి వస్తుందంటున్నారు.ఏపీలో వెనుకబడిన జిల్లాల పై ప్రధానంగా దృష్టి పెట్టిన జనసేన అధినేత ఇప్పటికే రాయలసీమలో ఉత్తరాంధ్రలో పర్యటనలు పూర్తి చేసేసారు.

మరోపక్క పవన్ కి పట్టున్న గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు సాధించాలంటే తూర్పు, పశ్చిమలో ఒక చోట నుంచి బరిలోకి దిగాలని జనసేన వ్యూహ కర్తలు సూచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఆయన పశ్చిమ నుంచి పోటీ చేసేలా అయితే ఏలూరు సురక్షితమని భావిస్తున్నట్లు తెలుస్తుంది.అదే విధంగా అనంతపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఈ రెండు స్థానాల్లో ఎదో ఒక చోట నుంచి లేదా ఈ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశలు ఉన్నాయని అంటున్నారు.దీనిపై పూర్తి స్థాయిలో పవన్ స్పందిస్తే కానీ అసలు విషయం ఏంటి అనేది తేలదు.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు