వీధికుక్కలకు భయపడి చెట్టి ఎక్కి కూర్చున్న చిరుతపులి

అడవుల్లో ఉండాల్సిన చిరుతలు నగరాల్లోకి,గ్రామాల్లోకి వచ్చి ఎంతటి స్వైర విహారం సృష్టిస్తాయో మనకు తెలిసిందే.వాటిని చూసిన మనుషులు భయంతో పరుగులు పెట్టడం,కొందరు దాని భారిన పడి ప్రాణాలు కోల్పోవడం అనేకసార్లు జరిగింది.

 Dogs Force Leopard To Retreat To Tree Top Karnataka-TeluguStop.com

కాని ఊర్లోకి రావాలనుకున్న చిరుతను ఆ ఊరి వీధికుక్కలు అడ్డుకున్నాయి.వాటికి భయపడి చిరుత ,చెట్టెక్కేలా చేశాయి.

కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని అటవీ ప్రాంతం నుంచి ఓ చిరుత కళ్లికోప్పలు గ్రామంలోకి చొరబడటానికి ప్రయత్నించింది.గ్రామం సరిహద్దులో ఉన్న వీది కుక్కలు చిరుతను గమనించి దానిని గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నాయి.చిరుత ఎంత సేపటికి అక్కడి నుంచి కదలకపోవడంతో వీధి కుక్కలు చిరుతను వెంటాడాయి.దాంతో చిరుత పరుగు లంఖించుకుంది.వీధి కుక్కల దెబ్బకు భయపడిన చిరుత పరుగు తీసి గ్రామానికి దగ్గరలో ఉన్న నాగేగౌడ అనే వ్యక్తి పొలంలోని చెట్టు ఎక్కి కుర్చుంది.వీధి కుక్కలు కూడా చెట్టు కింద నుంచి కదలకుండా అక్కడే కూర్చున్నాయి.

విషయం గమనించిన గ్రామస్తులు అటవి శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో… అటవి శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కింద వల సాయంతో చిరుతను పట్టుకున్నారు.ముందుగా చిరుతకు మత్తు మందు ఉన్న ఇంజక్షన్ వేశారు.

మత్తులోకి వెళ్లిన చిరుత వలలో పడింది.ప్రాణాలతో రక్షించబడిన చిరుతను తిరిగి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు అటవి శాఖ అధికారులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube