జనాల్లో సానుభూతి సంపాదించుకుని దాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకోవాలి అని చూస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ కలలు నెరవేరుతాయా అనే సందేహం ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతోంది.అందరితోనే కాదు సాక్ష్యాత్తు జగన్ కే ఆ సందేహం వచ్చేసింది.
అందుకే ఇప్పడు ఆయన అంతగా ఆందోళన చెందుతున్నాడు.ప్రజాసంకల్ప యాత్ర పేరుతో జనాల్లో తిరిగితే పార్టీకి మంచి భవిష్యత్తు ఉండడంతో పాటు అధికార పీఠం సులభంగా దక్కించుకోవచ్చు అనే ఆలోచనలో జగన్ ఉండిపోయాడు.
అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అది అంత సులభమయ్యే పని కాదని జగన్ కి ఇప్పుడు బోధపడింది.

జగన్పా లో వచ్చిన ఈ అకస్మాత్తు మార్పు కారణంగా… ప్రజా సంకల్ప యాత్ర అంతకు ముందులా ఉత్సాహంగా సాగడంలేదు.మొదలుపెట్టాము కదా మధ్యలో ఆపకూడదు అనే ఒక్క బలమైన కారణంగా అలా ముందుకు సాగుతోంది.రాష్ట్ర రాజకీయ పరిణామాలు మారిపోతుండటంతో ఈ సారి కూడా ఓటమిని చూడాల్సి వస్తుందేమో అనే భయం అప్పుడే జగన్ లో కనిపిస్తోంది.
ప్రజాసంకల్పయాత్రలో కనిపిస్తున్న నిరుత్సహన్ని చూస్తే తెలిసిపోతుంది.ఈ నిరుత్సాహానికి కారణం కూడా లేకపోలేదు.టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు పైకి ఒకరిని ఒకరు తిట్టుకుంటున్నట్టుగా కనిపిస్తున్నా .అంతిమంగా వారంతా కలిసి వైసీపీ ఓటమే కోరుకుంటున్నారని జగన్ కి అర్ధం అయిపొయింది

అంతే కాకుండా జగన్ చుట్టూ ఉన్న అనేక మంది నాయకులు మరోసారి ఓటమిని చవిచూడటం ఇష్టం లేక వీలైన పార్టీలోకి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు వెళ్లిపోతానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది.ఇవన్నీ జగన్ వరకు చేరడంతో ఆయనలో నిరుత్సాహం పెరిగింది.ఆ ఎఫెక్ట్ అంతా ఇప్పుడు పాదయాత్ర పై పడింది.
దీనికి తోడు పవన్ పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడంతో ఆయన అభిమానుల నుంచి వస్తున్న ఎదురుదాడి వైసీపీకి బాగా డ్యామేజ్ కలిగిస్తుండడం జగన్ కు రుచించడంలేదు.







