పాతకాలంలో జపానులో ఒక చిత్రమైన పద్ధతి ఉండేదట…….అదేంటంటే……… వయసైపోయి ఏ పనులు చేయలేని పరిస్థితిలో ……వారి పని కూడా చేసుకోలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులను తీసుకుని పోయి ఎతైన కొండప్రాంతాలలో వదిలి వచ్చేవారట…….వారి పని కూడా చేసుకోలేని ఆ ముసలివారు ఆకలితో అలమటించి……క్షీణించి చనిపోయేవారట…….ఇలాంటి కౄర మైన అలవాటు ఉండేదట…….ఒక యువకుడు కూడా తన తల్లి వయస్సుపైపడి చేతకాని స్థితిలో ఉందని ఆమెను తన బుజాలపై మోసుకుని కొండల్లో వదలేసి రావడానికి బయలు దేరాడు.మార్గమధ్యలో తన బుజంపైనున్న తన తల్లి ఏదో చేస్తున్నట్లు గమనించాడు….
చెట్టు కొమ్మలను తెంపుతూ ఉన్న తన తల్లిని ఏమీ ప్రశ్నించకుండా అలాగే వెళుతున్నాడు.

చాలా దూరం వెళ్ళాక తన తల్లిని కిందికి దింపి వెనుతిరుగుతూ తల్లిని ఇలా అడిగాడు…….” నిన్ను నా భుజంపై మోస్తున్నప్పుడు నువ్వు చెట్ల కొమ్మలను తుంచి ఎందుకు కింద పడేస్తూ వచ్చావు.అలా ఎందుకు చేశావో చెప్పు” అన్నాడు.
దానికి ఆ తల్లి ఇలా సమాధానం ఇచ్చింది…… ” నాయనా! నేను ముసలిదాన్ని అయిపోయాను నన్ను వదిలేస్తున్నావు పరవాలేదు…….మళ్ళీ నేను తిరిగి రాకూడదు అని చాలా దూరం నన్ను తీసుకుని వచ్చావు.
ఒకవేళ నువ్వు దారితప్పి ఇబ్బంది పడతావేమో అని బాధతో నీకు దారిని తెలిపే ఉద్దేశ్యంతో ఆ కొమ్మలను తెంపి దారిపొడుగునా వేస్తూ వచ్చాను.ఆ గుర్తులతో జాగ్రత్తగా ఇల్లు చేరుతావని అలా చేశాను” ఆమ్మ ఎలా ఉన్నా………ఎక్కడ ఉన్నా దేవతే…….
పిల్లల మంచే కోరుకుంటుంది తన తుది శ్వాస వరకు………ఆ తల్లి మాటలకు ఆ యువకుడికి బుద్ధి వచ్చి తన తల్లిని తనతో తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా చూసుకోసాగాడు.

అప్పటినుంచి ఎవరూ వారి తల్లిదండ్రులను అడవులలో వదిలివేయడం మానేశారట.తల్లిదండ్రులు పిల్లలతో సమానం…….మనం చిన్నప్పుడు చేసిన మొండితనాన్ని అల్లరిని ఎంతో ఓపిగ్గా భరిస్తారు………పెద్దవారు మనదగ్గర మొండితనం చేయరు, అల్లరి చేయరు…….
కాస్త ప్రేమగా చూసుకుంటే చాలు సంతోషపడిపోయి నా బిడ్డలంత గొప్పవారు లేరని మురిసిపోతారు….తల్లిదండ్రులను గౌరవించండి వారికి మీ ప్రేమను అందించండి చాలు.







