బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ ఏకైక కొడుకు అభిషేక్ బచ్చన్.ఈయన హీరోగా పలు చిత్రాల్లో నటించాడు.
కాని ఆశించిన స్థాయిలో ఈయనకు సక్సెస్‌లు దక్కడం లేదు.చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ ముందు బొక్కబోర్లా పడుతున్న నేపథ్యంలో గత మూడు సంవత్సరాలుగా అభిషేక్ బచ్చన్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.
సినిమాల్లో నటించకున్నా కూడా అభిషేక్ ఎక్కువగా విదేశాల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.ఎక్కువగా విదేశాలకు వెళ్తున్న అభిషేక్‌పై కొందరు సోషల్ మీడియాలో దారుణంగా విమర్శిస్తున్నారు.

తండ్రి, భార్య సినిమాలు చేస్తూ సంపాదిస్తుంటే ఆ డబ్బుతో జల్సాలు చేస్తున్నావు, నీకంటూ సినిమాల్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవడంలో విఫలం అయ్యావు అంటూ అభిషేక్ బచ్చన్‌పై కొందరు విమర్శలు చేస్తున్నారు.ఐశ్వర్యరాయ్ భర్తగానే నువ్వు ఉండి పోతున్నావు, ఆమె సంపాదనతో నీవు లైఫ్‌ను లీడ్ చేస్తున్నావు తప్ప నీకంటూ సంపాదన లేదు అంటూ ఇష్టం వచ్చినట్లుగా అభిషేక్ బచ్చన్‌పై విమర్శలు చేయడం జరుగుతుంది.దాంతో తాజాగా అభిషేక్ బచ్చన్ సోషల్ మీడియా ద్వారా కాస్త సీరియస్‌గానే స్పందించాడు.
తాను ఏం చేయకుండా ఐశ్వర్య మరియు తన తండ్రి అమితాబచ్చన్‌ల సంపాదనపై బతుకుతున్నట్లుగా విమర్శిస్తున్న వారికి సమాధానం చెప్పాడు.
సోషల్ మీడియాలో ఈయన స్పందిస్తూ.తాను సినిమాల్లో సక్సెస్ కాకపోవచ్చు, కాని నేను చేస్తున్న బిజినెస్ గురించి ఎవరికి తెలుసు, నాకు ఆటలు అంటే చాలా ఇష్టం, అందుకే నేను చాలా ఆటల్లో జట్లను కొనుగోలు చేశాను.
వాటి ద్వారా నాకు భారీ ఆధాయం వస్తుందని మీకు తెలుసా.

నేను జల్సాల కోసం విదేశాలు తిరుగుతున్నట్లుగా భావించే వారు గుర్తుంచుకోవాలి, తాను ఎప్పుడు విదేశాలకు వచ్చినా కూడా బిజినెస్ పని లేదంటే ఆటల కోసం తప్ప ఎప్పుడు కూడా జల్సాలు చేసేందుకు వెళ్లలేదు అని, అసలు నాకు జల్సాలకు సమయం లేదు అంటూ అభిషేక్ చెప్పుకొచ్చాడు.సోషల్ మీడియాలో తనపై వ్యతిరేక కామెంట్స్ చేసే వారు ఖాళీగా ఉండి ఉంటారు అని, అందుకే నా గురించి ఆలోచిస్తున్నారు అని, ఇప్పటికైనా మీ పని చూసుకోండి.నా పనితో నేను చాలా బిజీగా ఉన్నాను, మళ్లీ నన్ను డిస్ట్రబ్ చేయవద్దంటూ అభిషేక్ చెప్పుకొచ్చాడు.








