బిగ్‌బాస్‌లో సత్తా చూపిస్తున్న సామ్రాట్.. అసలు కారణం ఇదే!

తెలుగు బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ ఉత్కంఠను రేపుతుంది.ఇప్పటికే ఈ షో నుండి పలువురు సెలిబ్రిటీలు ఇంటిముఖం పట్టారు.

 Samrat Gives Tough Competition In Biggboss-TeluguStop.com

కాగా హౌస్‌లో ఇప్పుడున్న కంటెస్టంట్స్‌లో మాంచి పోటీ నెలకొంది.ముఖ్యంగా ఇంటి టీమ్ సభ్యులంతా ఒకవైపు చేరి కౌశల్‌ను టార్గెట్ చేశారు.

కానీ వీరిలో నిలకడగా ఎవరైనా ఉన్నారంటే మాత్రం అది ఖచ్చితంగా సామ్రాట్ అని చెప్పాలి.బిగ్‌బాస్ షో 13వ కంటెస్టంట్‌గా ఎంట్రీ ఇచ్చిన సామ్రాట్, తన గేమ్ ప్లాన్‌ను చాలా నెమ్మదిగా స్టార్ట్ చేశారు.

అందరితో కలిసిమెలిసి ఉండటంతో తొందరగా ఇంటి సభ్యులకు దగ్గరయ్యాడు.

సామ్రాట్ క్యారెక్టర్ గురించి తొలుత ఎవ్వరూ కూడా ఒక నిర్ణయానికి రాలేకపోయారు.

అయితే సమయం గుడుస్తున్న కొద్ది సామ్రాట్ తన క్యారెక్టర్ ఏమిటనేది ప్రేక్షకులు చూపించాడు.అందరినీ చాలా కేరింగ్‌గా పలకరిస్తూ మాట్లాడటం మొదలుపెట్టాడు సామ్రాట్.

తనీష్, దీప్తి సునైనా, తేజూలకు చాలా దగ్గరగా మెదులుతూ వచ్చిన సామ్రాట్ వీరికి అవసరం ఉన్న సమయంలో మంచి సలహాలు అందిస్తూ తాను స్నేహానికి ఇచ్చే విలువ ఏమిటో చెప్పాడు.ఇంటి సభ్యులను ఎవరినీ నొప్పించకుండా మెదలడం ఒక్క సామ్రాట్‌కే చెల్లిందనడంలో అతిశయోక్తి లేదు.

షో మొదలయినప్పుడు ఉన్న సామ్రాట్ వేరు ఇప్పుడు మనం చూస్తున్న సామ్రాట్ వేరు అని అంటున్నారు జనాలు.ఇటీవల తేజూ ఎలిమినేట్ కావడంతో సామ్రాట్ మరింత జాగ్రత్తగా గేమ్ ఆడుతున్నాడు.అయితే తనకు ఇష్టమైన తేజూ ఎలిమినేట్ కావడంతో సామ్రాట్ గేమ్ ఆడటం లేదని వాదించిన వారికి దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చాడు.సోమవారం రోజున తనకు ఎంతో దగ్గరయిన దీప్తి సునైనాను స్వయంగా నామిటేన్ చేసాడు సామ్రాట్.

దీనికి ఒక జెన్యూన్ రీజన్ కూడా ఇచ్చాడు సామ్రాట్.దీంతో జనాల మనసు గెలుచుకున్నాడు ఈ నటుడు.

తన గేమ్‌ను ప్రూవ్ చేసుకుంటూ అందరికీ గట్టి పోటీ ఇస్తూ దూసుకెళుతున్న సామ్రాట్ విషయంలో సోషల్ మీడియాలోని ట్రోల్స్ చూసి అతడి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.గతంలో సామ్రాట్‌పై నెగెటివ్ ట్రోల్స్ రాగా ఇప్పుడు అతడి నిజస్వరూపం చూసి పాజిటివ్ ట్రోల్స్ వస్తుండటంతో ప్రేక్షకులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సామ్రాట్ ఇదే ఆటతీరును ప్రదర్శిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాడని అంటున్నారు జనాలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube