తెలంగాణాలో తుడుచుపెట్టుకుపోయిన టీడీపీ పై ఇప్పుడు టీఆర్ఎస్ యుద్ధం మొదలుపెట్టింది.పార్టీ కి ఇక్కడ మనుగడలేకపోయినా బలమైన ఓటు బ్యాంక్ మాత్రం ఉంది.
అంతే కాదు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకోబోతోంది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ లో ఆందోళన మొదలయ్యింది.అదే జరిగితే టీఆర్ఎస్ కి పడే ఓట్లకు గండం పడుతుంది.
అందుకే మంత్రి హరీష్ రావు తెలంగాణ సెంటిమెంట్‌ను రేపి మళ్లీ టీడీపీని ఆంధ్రా పార్టీగా ముద్ర వేసి.అలాంటి పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటోందని ఆరోపణలు చేయడానికి సిద్ధమయ్యారు.

తెలంగాణాలో తమకు ఎదురే లేదని భావిస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం ఆందోళన పెంచింది.సరిగ్గా ఇదే సమయంలో పుండు మీద కారం జల్లినట్టు కాంగ్రెస్ – టీడీపీ బంధం బలపడే అవకాశం కనిపించడంతో కంగారుపడుతోంది.అందుకే ఇప్పటి వరకు టి.టీడీపీ ని పట్టించుకోని టీఆర్ఎస్ మొన్న పార్లమెంట్ లో అవిశ్వాసం సందర్భంగా తన యాక్షన్ ప్లాన్ మార్చుకుంది.అవిశ్వాస తీర్మానంపై చర్చకు రెండు రోజుల ముందు వరకూ.ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్ కు మద్దతు ప్రకటించిన టీఆర్ఎస్ హఠాత్తుగా యూటర్న్ తీసుకుంది.ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే.తెలంగాణకూ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడం ప్రారంభించారు.
లోక్‌సభలో విభజన అశాస్త్రీయంగా జరిగిందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రసంగిస్తే.టీఆర్ఎస్ సభ్యులు అడ్డుకున్నారు.ఆ తర్వాత అవే మాటలు ప్రధానమంత్రి అంటే సైలెంట్‌గా ఉండిపోయారు.ఇప్పుడు తెలంగాణలో ఆ ప్రత్యేకహోదా కేంద్రంగానే రాజకీయాలు ఓ రేంజ్‌లో చేస్తున్నారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో.అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తీర్మానం చేయడాన్ని టీఆర్ఎస్ తెలంగాణలో భూతద్దంలో చూపిస్తోంది.
తెలంగాణ పరిశ్రమలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ పట్టుకుపోయి.ఆంధ్రాలో పెట్టబోతోందన్నట్లుగా హరీష్ చెప్పుకొస్తున్నారు.







