తెలంగాణ అధికార పార్టీలో ఇంటిపోరు బాగా ముదిరిపోయింది.నాయకులు ఒకరంటే ఒకరికి అస్సలు పడడం లేదు.
ఎన్నికలు సమయం దగ్గరకు వస్తున్న తరుణంలో ఈ విభేదాలతో పార్టీ పరువును బజారున పడేస్తుండడంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి తలనొప్పిగా మారింది.నాయకుల మధ్య సమన్వయం ఏర్పడేలా కేసీఆర్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవేవీ వర్కవుట్ అవ్వడం లేదు.
టీఆర్ఎస్ నాయకుల మధ్య సమన్వయం లోపించడానికి ప్రధాన కారణం ఆధిపత్యపోరు.ప్రతి నియోజకవర్గంలోనూ లెక్కకు మించి నాయకులు ఉండడంతో వారి మధ్య తరచూ విభేదాలు వస్తున్నాయి.
ఈ వ్యవహారాలతో కార్ టైర్ తరచూ పంచర్ పడుతోంది.ఎన్నికలనాటికి కార్ స్పీడ్ పెంచుదామని చూస్తున్న గులాబీ బాస్ కి చుక్కలు చూపిస్తున్నారు నాయకులు.
జిల్లాల్లో ఆధిపత్య పోరుతో తమ వాళ్లకు అవకాశాలు ఇప్పించుకునేందుకు కొందరు.తమ కుటుంబ సభ్యులకు టికెట్లు ఇప్పించుకునేందుకు మరికొందరు గ్రూపులు కట్టారు.ఈ వ్యవహారం కింది స్థాయిలో ఉండే కార్యకర్తలకు ఇబ్బందిగా మారింది.టీఆర్ఎస్ నాయకులు ఎక్కువగా ఉండే నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే ఇద్దరు నేతలను సస్పెండ్ చేయాలంటూ లేఖలు రాశారు ఆ జిల్లా ప్రతినిధులు.
జిల్లాలో మొత్తం టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులే అనుకుంటే అదే ఇప్పుడు అక్కడ మైనస్ గా మారింది.జిల్లా మొత్తం ఎంపీ కవిత పర్యవేక్షిస్తుండగా … మంత్రి పోచారం ఒకవైపు, మరికొంతమంది ఎమ్మెల్యేలు మరోవైపు ఎవరికీ వారు రాజకీయాలు చేస్తూ పార్టీకి ఇబ్బందిగా మారారు.

వరంగల్ జిల్లాలో కొండా దంపతులు పెట్టిన టికెట్ల పంచాయితీ బహిరంగ విమర్శలకు దారితీస్తోంది.స్పీకర్‌కు సవాల్ విసిరిన కొండా సురేఖ ఆపై వరంగల్ మేయర్ నన్నపనేని నరేందర్‌పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.దీనికి మేయర్ నరేంద్ర కూడా కౌంటర్ ఇచ్చారు.నువ్వా నేనా అన్నట్లుగా ఇద్దరి మధ్య రాజకీయం నడుస్తోంది.ఖమ్మంలో మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి గా రెండు వర్గాలు ఏర్పడ్డాయి.వచ్చే ఎన్నికల్లో ఎవరి అనుచరులకు వాళ్లు టికెట్లు ఇప్పించుకునేందుకు ఇప్పటి నుంచే గ్రూపు రాజకీయాలు మొదలుపెట్టారు.
మరో నేత పువ్వాడ అజయ్ కూడా మరో గ్రూపును తయారు చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు.
కరీంనగర్ లోను ఎమ్మెల్యేలకు ,ఎంపీ కి మధ్య విబేధాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి.
టికెట్ విషయంలో మంత్రి ఈటెల రాజేందర్ వైపు కొంతమంది, ఎంపీ వినోద్ వైపు కొంతమంది గ్రూప్ లుగా విడిపోయారు.ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు ఆధిపత్య పోరులో బిజీగా ఉన్నారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ,రో మంత్రి జోగు రామన్న వర్గాలుగా విడిపోయారు.







