ఆ సూపర్‌ హిట్‌ చిత్రం సుధీర్‌బాబు చేస్తే అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యేది!

కొన్ని సార్లు సూపర్‌ హిట్‌ అయిన చిత్రాల గురించి ఆ హీరో వద్దకు ఈ కథ మొదట వెళ్లింది, ఆ హీరో ఈ చిత్రంను వదులుకోవడంతో చాలా పెద్ద సక్సెస్‌ను వదులుకున్నాడు, ఆ హీరోయిన్‌ ఈ సినిమాను మిస్‌ చేసుకుని పెద్ద సక్సెస్‌ అయ్యింది అంటూ గతంలో పలు సార్లు విన్నాం.సినిమా సక్సెస్‌ అయిన సందర్బంలో ఎక్కువగా ఇలాంటి వార్తలు చూస్తూ ఉంటాం.

 Sudheer Babu Rejected Rx 100 Movie-TeluguStop.com

పవన్‌ కళ్యాణ్‌ మిస్‌ చేసుకున్న పలు చిత్రాలు రవితేజ వద్దకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.ఇక ఇప్పుడు ‘ఆర్‌ఎక్స్‌100’ చిత్రం గురించిన ఆసక్తికర వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రాన్ని మొదట దర్శకుడు అజయ్‌ భూపతి పలువురు హీరోలకు వినిపించాడు.ముఖ్యంగా విజయ్‌ దేవరకొండ మరియు సుధీర్‌బాఋ ఉన్నారు.విజయ్‌కి కథ నచ్చినప్పటికి కాస్త టైం కావాలని అన్నాడు.ఇక ఇదే కథను సుధీర్‌బాబుకు కూడా వినిపించాడు.

సుధీర్‌బాబు ఈ కథకు మొదట నో చెప్పి, ఆ తర్వాత చూద్దాం అన్నట్లుగా చెప్పాడు.స్క్రీన్‌ప్లేలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి మరోసారి సుధీర్‌బాబుకు వినిపించినా కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు.

దాంతో కొత్త వారితో ఈ చిత్రాన్ని చేయాలని అజయ్‌ నిర్ణయించుకున్నాడు.కొత్త వారితో చిత్రాన్ని చేయడం కోసం స్క్రీన్‌ప్లేలో మసాలా యాడ్‌ చేయడం జరిగింది.

సుధీర్‌బాబుకు కథ చెప్పిన సమయంలో ముద్దు సీన్స్‌తో పాటు, రొమాంటిక్‌ సీన్స్‌ను చెప్పలేదు.సుధీర్‌బాబు ఎలాగూ వాటికి నో అంటాడు కనుక దర్శకుడు వాటిని ముందే వద్దనుకున్నాడు.

సుధీర్‌బాబు ఈ చిత్రాన్ని నో అనుకున్న తర్వాత కార్తికేయతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని భావించాడు.కార్తికేయ మరియు పాయల్‌తో మాట్లాడి ముద్దు సీన్స్‌కు ఒప్పించాడు.ఇద్దరు కూడా ముద్దు సీన్స్‌కు ఎలాంటి అభ్యంతరం పెట్టక పోవడంతో సినిమాలో చాలా ముద్దు సీన్స్‌ను పెట్టేశాడు.

ఒకవేళ సుధీర్‌బాబు ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రాన్ని చేసి ఉంటే ఖచ్చితంగా ముద్దు సీన్స్‌ ఉండేవి కాదు.

అలాగే అంత రఫ్‌గా హీరోను చూపించే వారు కాదు.సుధీర్‌బాబుది సాఫ్ట్‌ ఇమేజ్‌.అందుకే ఆయనను చాలా సాఫ్ట్‌గా ఈ చిత్రంలో చూపించాల్సి వచ్చేది.అలా చూపిస్తే సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యేది.

అందుకే ఆర్‌ఎక్స్‌ 100 చిత్రంను సుధీర్‌బాబు మిస్‌ అవ్వడం మంచిదే అయ్యింది, సుధీర్‌బాబుకు మరియు సినిమాకు కూడా కలిసి వచ్చింది.ఆర్‌ఎక్స్‌ 100 చిత్రం 10 కోట్ల వసూళ్లు సాధించి దుమ్ము రేపుతోంది.

నిర్మాతకు కాసుల వర్షం కురుస్తుంది.దర్శకుడు అజయ్‌ భూపతి కూడా భారీ క్రేజ్‌ను దక్కించుకున్నాడు.

ఈయనతో సినిమా చేసేందుకు పలువురు హీరోలు ఇప్పుడు ఆసక్తి చూపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube