రోజులే బాగున్నాయ్…అంటూ సోషల్ మీడియాలో ఓ మెసేజ్ వాట్సాప్, ఫేస్బుక్ రూపంలో అందర్నీ టచ్ చేస్తూ వారి చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది.బాల్యం మధుర జ్ఞాపకం అంటూ చిన్ననాటి రోజులను అప్పటి పరిస్థితితులను గుర్తు చేస్తుంటే…అబ్బా వాట్ ఏ మెమరబుల్ డేస్ అంటూ ప్రతి ఒక్కరు తమ బాల్యాన్ని తడిమి చూసుకుంటున్నారు.
ఆ మెసేజ్ మీకోసం
ఆ రోజులు బాగున్నాయ్…
ఆదివారం ఆటలాడుతూ అన్నాన్ని మరిచిన
ఆ రోజులు బాగున్నాయ్…
మినరల్ వాటర్ గోల లేకుండా నల్లా దగ్గర, బోరింగుల దగ్గర, బావుల దగ్గర నీళ్లు తాగిన
ఆ రోజులు బాగున్నాయ్….
ఎండాకాలం సలివేంద్రాల దగ్గర చల్లని నీళ్ల కోసం
ఎర్రని ఎండని సైతం లెక్క చేయని
ఆ రోజులు బాగున్నాయ్….
వందల కొద్దీ చానళ్ళు లేకున్నా, ఉన్న ఒక్క దూరదర్శన్ లో చిత్రలహరి,ఆదివారం సినిమా కోసం వారమంతా ఎదురుచూసిన
ఆ రోజులు బాగున్నాయ్….
సెలవుల్లో అమ్మమ్మ,నానమ్మ ల ఊళ్ళకు వెళ్లి
ఇంటికి ఎప్పుడు రావాలన్న ఆలోచనే లేని
ఆ రోజులు బాగున్నాయ్….
Ac కార్లు లేకున్నా ఎర్ర బస్సు లో కిటికీ పక్క సీట్లో నుండి ప్రకృతిని ఆస్వాదించిన
ఆ రోజులు బాగున్నాయ్…
మొబైల్ డేటా గురించి ఆలోచించకుండా బర్త్ డే డేట్ గురించి మాత్రమే ఆలోచిస్తూ చాక్లెట్లు పంచిన
ఆ రోజులు బాగున్నాయ్….
మటన్ బిర్యానీ,చికెన్ బిర్యానీ లేకున్నా ఎండాకాలం మామిడికాయ పచ్చడి పెట్టిన రోజున అందరం కలిసి అన్నం తిన్న
ఆ రోజులు బాగున్నాయ్….
జేబు నిండా కార్డులున్నా,పర్సు నిండా డబ్బులున్నా; కొట్టుకు పంపితే మిగిలిన చిల్లర కాజేసిన
ఆ రోజులు బాగున్నాయ్….
సెల్లు నిండా గేములున్నా;బ్యాటు మార్చుకుంటూ క్రికెట్టాడిన
ఆ రోజులు బాగున్నాయ్….
బీరువా నిండా జీన్స్ ప్యాంట్లున్నా;
2 నిక్కర్లతో బడికెళ్ళిన
ఆ రోజులు బాగున్నాయ్….

బేకరీల్లో కూల్ కేకులు తింటున్నా; పావలా ఆశా చాక్లెట్ తిన్న
ఆ రోజులు బాగున్నాయ్….
చిన్న చిన్న మాటలకే దూరం పెంచుకుంటున్న ఈ రోజుల్లో; పిల్లలం కొట్టుకున్నా సాయంత్రం కల్లా కలిసిపోయిన
ఆ రోజులు బాగున్నాయ్…
ఇప్పుడు ఇంటి నిండా తినుబండారాలున్నా ;
నాన్న కొనకొచ్చే చిరుతిళ్ళ కోసం ఎదురుచూసిన
ఆ రోజులు బాగున్నాయ్….
బట్టర్ స్కాచ్ చల్లగా నోట్లో నానుతున్నా; అమ్మ చీర కొంగు పైసలతో గీతా ఐస్ కొని తిన్న
ఆ రోజులు బాగున్నాయ్…
దొంగల భయం,సెల్ ఫోన్ పోద్దనే భయం లేకుండా
ఎండాకాలం లో ఆకాశంలో చందమామని చూస్తూ నిదురించిన
ఆ రోజులు బాగున్నాయ్…
ఆ రోజులు బాగుంటాయ్;
ఎందుకంటే అవి మళ్ళీ రావు కాబట్టి….