పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో భారీ ఎత్తున చేరికలు జరుగుతున్నాయి.పలు పార్టీల నుండి జనసేన పార్టీలోకి వలసలు మొదలు అయ్యాయి.
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు జోరు పెంచాడు.వరుసగా జనసేనలో చేరికలు జరుగుతున్న ఈ సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ తాజాగా భారీ ఎత్తున జనసేనలో జాయిన్ కావడం జరిగింది.
చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు స్వామినాయుడు తాజాగా జనసేన పార్టీలో జాయిన్ అయ్యాడు.కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన మొత్తం అభిమాన సంఘంను తీసుకుని జనసేనలో జాయిన్ అయిపోయాడు.
తాజాగా హైదరాబాద్‌లో అభిమానులు మరియు ఆప్తుల సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నాడు.ఆ సందర్బంగా జనసేనాని పవన్ మాట్లాడుతూ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేయడం జరిగింది.పవన్ కళ్యాణ్ తాజాగా పలువురు మెగా ఫ్యాన్స్‌ను పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువ కప్పడం జరిగింది.భారీ ఎత్తున మెగా ఫ్యాన్స్ తరలి రావడంతో వారికి ఊపునిచ్చేలా పవన్ మాట్లాడాడు.
పవన్ వచ్చే ఎన్నికల్లో మెగా ఫ్యాన్స్ సాయంను ఆశించడం జరిగింది.మెగా ఫ్యాన్స్ అంతా కూడా జనసేనకు మద్దతుగా నిలవాల్సిందిగా కోరాడు.?
పవన్ ఇంకా మాట్లాడుతూ.జనసేన పార్టీ అనేది ఒక మెగా అభిమాని పార్టీ అని, చిరంజీవి అభిమానుల పార్టీ జనసేన అంటూ చెప్పుకొచ్చాడు.చిరంజీవి అభిమానిని అయిన నేను ఈ పార్టీని స్థాపించాను, ఆయన అభిమానులంతా కూడా జనసేనకు మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.అన్నయ్య చిరంజీవి జనసేన పార్టీలో ఉన్నా లేకున్నా కూడా తప్పకుండా ఆయన ఆశీస్సులు అనేవి తప్పకుండా జనసేనపై ఉంటాయనే నమ్మకంను పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశాడు.
పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడంతో మెగా ఫ్యామిలీ మరియు మెగా ఫ్యాన్స్ అంతా కూడా జనసేనకు మద్దతుగా ఉంటారనే నమ్మకంను వ్యక్తం చేశాడు.వచ్చే ఎన్నికల్లో ఏపీ నుండి పవన్ పోటీ చేసి ప్రభుత్వ ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నాడు.
ఈ కారణంగానే పవన్ కళ్యాణ్‌కు మెగా ఫ్యాన్స్ మద్దతు అవసరం అయ్యింది.భారీ ఎత్తున పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా మెగా ఫ్యాన్స్ తరలి రావడంతో చిరంజీవి గురించి చాలా పాజిటివ్‌గా పవన్ మాట్లాడాడు.
పవన్ వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్‌కు ఉత్సాహంను కలిగించాయి.అయితే రాజకీయం పరంగా మాత్రం పవన్ వ్యాఖ్యలు అవసరానికి అనుగుణంగా ఉన్నాయి అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.