సుజనా చౌదరి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు.ఆయన పేరు చెప్పగానే రాజకీయాలు తెలిసినవాళ్ళు ఆయన చంద్రబాబు కి నమ్మిన బంటు టీడీపి అధికారంలో లేనప్పుడు ప్రధాన ఆర్ధిక వరనరూ అంటారు.
మరి కొంత మంది చంద్రబాబు సుజనా మంచి స్నేహితులు అనుకుంటారు అంటే వారి మధ్య ఉండే భంధం అలా కనిపించేది అయితే ఈ మధ్య కాలంలో మీడియాలో సుజనా చౌదరి బీజేపి లోకి వెళ్తున్నాడు అనే ప్రకటన వచ్చిన తరుణంలో పిలో తెలుగుదేశం నేతలు అంతా ఒక్కసారిగా ఆవ్వాక్కాయారు.మీడియా సైతం ఆశ్చర్య పడింది.
అయితే ఈ వార్తల్లో నిజమెంత అనే వివరాలలోకి వెళ్తే.
![](https://TeluguStop.com/wp-content/uploads/2018/05/why-chandrababu-fire-on-sujana-chowdary1.jpg)
గత ఎన్నికల్లో పొత్తుల కారణంగా 2014లో అటు కేంద్రంలో టీడీపీకి రెండు క్యాబినెట్ ర్యాంక్ పదవులు ఇటు రాష్ట్రంలో బీజేపీకి రెండు మంత్రి పదవులు దక్కాయి.చంద్రబాబు తాను బంటు సుజనాకి, అశోక్‌గజపతి రాజు కు మరొకటి సుజనా చౌదరికి చంద్రబాబు ఇప్పించుకున్నారు.చంద్రబాబుకు , సుజనాచౌదరి టీడీపీ పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి ప్రధాన ఆర్థిక వనరుగా ఉపయోగపడ్డారు.
తాను ఇవ్వడమే కాకుండా.అనేక మంది పారిశ్రామికవేత్తల ద్వారా ఎప్పటికప్పుడు పార్టీకి భూరి విరాళాలు ఇప్పించారు సుజనాచౌదరి.
ఈ కారణంగానే, పార్టీ కోసం ఆయన పడిన కష్టానికి కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టారు చంద్రబాబు.
అయితే అశోక్ గజపతిరాజు మాత్రం రిస్క్ ఎప్పుడూ చేయరు అదే చంద్రబాబు కి పెద్ద తలనెప్పి తెచ్చి పెట్టింది కి ఈ రోజుల్లో సగటు రాజకీయనాయకుడికి ఉండాల్సిన అసలు లక్షణాలు రాజు గారికి లేవు రెకమెండేషన్, లాబీయింగ్.
మీడియేషన్ లాంటి వ్యవహారాలకు ఆయన చాలా దూరంగా ఉంటారు.కేంద్రంతో వివిధ వ్యవహారాలు డీల్ చేయడానికి.
మీడియేట్ చేయడానికి సుజనా చౌదరి పనికొస్తారని ఆయన మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు చంద్రబాబు.గత కొంతకాలంగా చంద్రబాబు చెప్పిన చిన్న చిన్న పనులు చేయడంలో కూడా సుజనాచౌదరి పూర్తిగా విఫలమయ్యారని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.
రాష్ట్రం యొక్క పరిస్థితిని కేంద్రం వద్ద సరిగా వినిపించలేక పోయారనే కోపం కూడా సుజనాపై చంద్రబాబు కు ఉందట దనతో నంద్యాల ఉపఎన్నిక వాయిదా విషయంలో కూడా ఫెయిల్ అయ్యారని చంద్రబాబు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.మోడీ తో అపాయింట్‌మెంట్ విషయంలో సైతం సుజనా ఫెయిల్ అయ్యారని తెలుస్తోంది.
ఓ సందర్భంలో సుజనా చౌదరి వద్దే చంద్రబాబు అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది…అయితే పార్టీ ప్రయోజనాలకంటే కూడా సొంత ప్రయోజనాలకే సుజనా ఆసక్తి చూపిస్తున్నరనే విషయం కూడా చంద్రబాబు చెవిన పడిందట.అందుకే సుజనాని పక్కన పెట్టి యంగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడికి మరియు గల్లా జయదేవ్ కి భాద్యతలు అప్పగించడం మొదలు పెట్టారట చంద్రబాబు.
అందుకే సుజనా ఈ మధ్య టీడీపి కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారని టాక్ బలంగా వినిపిస్తోంది అంటున్నారు టీడీపి నేతలు.