కొంత మంది ప్రవర్తన చూస్తే అయ్యో పాపం అని అన్పిస్తుంది.వారిని ఏ మాత్రం మార్చలేము.
వారు ఏదైనా వస్తువును తీసుకుంటే ఆ వస్తువును తిరిగి ఇవ్వటానికి ఇష్టపడరు.ఇటువంటి ప్రవర్తనకు రాశులు కారణం అని మీకు తెలుసా? అవును రాశి కారణంగా ఇటువంటి ప్రవర్తన ఉంటుంది.ఇప్పుడు ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.
మేష రాశిఈ రాశి వారు తమ గురించి తప్ప ఇతరుల గురించి అసలు ఆలోచించరు.అలాగే అసలు పట్టించుకోరు.24 గంటలు తమ గురించే ఆలోచిస్తూ ఉంటారు.ఈ రాశి వారు బాగా కష్టపడతారు.తమకు ఉపయోగపడే ఏ విషయాన్నీ అంత తేలిగ్గా వదిలిపెట్టరు.దాంతో తమకు ఉపయోగపడే ప్రతిదీ సొంతం కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు.

సింహ రాశివీరు చాలా ఎక్కువగా వారి గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు.ఇక ఏ విషయాన్నీ పట్టించుకోరు.వీరికి విపరీతమైన స్వార్ధం కూడా ఉంటుంది.
వీరిని ఎవరైనా పట్టించుకోకపోతే వారికీ నరకం చూపిస్తారు.అలాగే ఇతరుల వద్ద ఉన్న ఏ విషయాన్నీ అయినా సంగ్రహించటానికి వెనకడుగు వేయరు.
కన్య రాశివీరు ఎప్పుడు ఇతరులను విమర్శిస్తూ ఉంటారు.వీరిని ఎవరైనా విమర్శిస్తే మాత్రం అసలు తట్టుకోలేరు.వీరుసరదాగా ఉంటారు.వీరి గురించి ఎవరైనా తప్పు మాట్లాడితే అసలు సహించరు.
ప్రతీకారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
ధనస్సుఈ రాశి వారిలో ఎదుటి వారి గురించి ఆలోచించాలనే చింతన అసలు కనపడదు.
వీరు ఎవరికైనా మాట ఇచ్చిన పరిస్థితులు సరిగా లేకపోతె ఆ మాటను అసలు పట్టించుకోరు.వీరు ఎదుటివారికి సాయం చేయాలంటే వారికీ ఎటువంటి ఆపద లేదంటేనే సాయం చేస్తారు.







